గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గ్రామాలలో పండుగ వలే సాగిన జెండా ఆవిష్కరణలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, ఆగస్టు 15 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల వ్యాప్తంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 శుక్రవారం 27 గ్రామాలలో కన్నుల పండుగ వలే జరుపుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో మాజీ మమ్మద్ అబ్దుల్లా ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారి కిషోర్, మండల విద్యాధికారి రాజన్న, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కృష్ణా సాగర్ రెడ్డి,జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఏనుగుల మల్లయ్య జెండా ఎగురవేశారు.
అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు జాతీయ జెండాను ఎగరవేయగా, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జెండాను ఎగరవేసి జెండా వందనం చేస్తూ, జనగణమనను ఆలపిస్తూ, స్వీట్లు పంచుతూ దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం జాతీయ గీతం ఆలపించిన విద్యార్థులకు తాసిల్దార్ బుక్కులు, పెన్నులు అందజేశారు.
ఈ కార్యక్రమాలల సూపరిండెంట్ రవీందర్, ఆర్ఐలు అనూష జీవన్,రెవెన్యూ సిబ్బంది, వివిధ కార్యాలయాల సిబ్బంది, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత
.jpg)
ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ

గాంధీ హ్యాకర్స్ ఆధ్వర్యంలో జెండా వందనం

శాతవాహన స్కూల్ లో జండపండుగ

గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
