గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్
జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు)
గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సి పి ఆర్) పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ అన్నారు. సిపి ఆర్ పట్ల అవగాహన కల్పించడానికిగాను రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థినిలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
శనివారం మధ్యాహ్నం 2 -30 గంటలప్రాంతంలో కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈకార్యక్రమంలో శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా సిపిర్ పై శిక్షణ ఇవ్వడానికి గాను డా సతీష్, డా బలరాం హాజరుకాగా, నిర్వాహకులు,రోటరీ -ఆపి -రెడ్ క్రాస్ ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్ , టీవీ సూర్యం, ఏవిఎల్ఎన్ చారి, ఎన్.రాజు, బొడ్ల జగదీశ్, భూమేశ్వర్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి.లిల్లి మేరీ, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ, సి పి ఆర్ అనేది ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఉపయోగించే కీలకమైన ప్రథమ చికిత్స అని వివరించారు. ఇది వైద్య సహాయం వచ్చే వరకు మెదడు మరియు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుందన్నారు. నిమిషానికి 100–120 బీట్ల వద్ద ఛాతీ కుదింపులతో కూడినదనీ,అత్యవసరంగా ప్రాథమిక స్థాయిలో చేతులు మాత్రమే ఉపయోగించే సి పి ఆర్ బాధితుడు బ్రతకడానికి గల అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.
ప్రాణాలను కాపాడే సిపి ఆర్ జ్ఞానంతో ప్రతీ ఒక్కరిలో అవగాహన కల్పిస్తూ, శిక్షణ పొందడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి అభినందనలు చెపుతూ, నర్సింగ్ విద్యార్థినీ లు సిపిఆర్ పట్ల పూర్తి అవగాహన పెంచుకుని శిక్షణ పొందాలని ఎమ్మెల్యే సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
