హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు
జగిత్యాల జులై 25( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏట నిర్వహిస్తున్నట్లుగా శుక్రవారం శ్రావణమాసం అభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి .వైదిక క్రతువులు అన్యారంభట్ల మృత్యుంజయ శర్మ .జన్మంచి సత్యనారాయణ తదితరులు నిర్వహించారు.
ఉదయము స్వామివారి మూలవిరాట్ కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణపతి ఉపనిషత్తులు. నారాయణ ఉపనిషత్తు . మన్యుసూక్తము, రుద్ర నమకం, చమకం పురుష, శ్రీ సూక్త దుర్గాసూక్తములతో అభిషేకములు కొనసాగాయి. స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మూలమూర్తులను దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదము, మహదాశీర్వచనము నిర్వహించారు .ఉదయం 6 గంటల నుండి ప్రతినిత్యం అభిషేకములు ప్రారంభమగునని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయ సిద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
వైదిక క్రతువులలో ఆలయ అధ్యక్షులు చాకుంట వేణు మాధవరావు ,సిరిసిల్ల గణపతి శర్మ మోతె రాజగోపాల్ రావు,శ్రీధర గణపతి శర్మ ,కొత్తపల్లి శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
