మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం... ఇచ్చిన హామీలపై చర్చిద్దాం
ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్
ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ
తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ కార్యదర్శి వీరన్న
కొత్తగూడెం జూలై 10:
"పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. మేం మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం. కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ కింద తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం" అని స్పష్టం చేశారు.
కొత్తగూడెంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ జాగృతి విస్తృత సమావేశంలో సీపీఎం జిల్లా నాయకుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరన్న తన అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి లో చేరారు. ఆయనకు తెలంగాణ జాగృతి కండువాను కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.... తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరిస్తోందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్లు సాధకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తున్నామని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, సంపూర్ణ రైతురుణమాఫీ కాలేదనీ, ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటే సీఎం పారిపోయారని మండిపడ్డారు.ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారని తెలిపారు.
సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదనీ, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదని ప్రస్తావించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటుపరం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి,అసమర్థ ముఖ్యమంత్రి అనే బిరుదు ఇచ్చామని చెప్పారు. మహిళల పక్షాన జాగృతి పోరాటం చేస్తుందనీ స్పష్టం చేశారు.
"కొత్తగూడెం జిల్లా అంటే పరిశ్రమలు ఉండే జిల్లా. ఐటీసీలో కాలుష్యం లేకుండా పరిశ్రమ యాజమాన్యం దృష్టి సారించాలి. స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని పునరుద్ధరణ చేయాలి." అని డిమాండ్ చేశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో తిరిగి కలపాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.
"భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఆందోళనలో ఉన్నాయి. భద్రాచలం రాముడి భూములు పురుషోత్తపట్నంలో ఉన్నాయి.ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవ తీసుకోవాలి. తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు తుమ్మల ఐదు గ్రామ పంచాయతీలపై లెటర్ ఇచ్చారు. పురుషోత్తపట్నంలో ఉన్న రాముడి భూములను చూడటానికి వెళ్లిన రామాలయం ఈవోపై దాడి చేశారు. భద్రాచల రాముడు తెలంగాణ దేవుడు." అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆడబిడ్డ,బీసీ బిడ్డ భద్రాచలం రామాలయం ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే 70 శాతం పూర్తయ్యాయని.. మిగతా పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నాలుగవ రోజుకు చేరుకున్న మహాభారతం ప్రవచనం
జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు)స్థానిక ధరూర్ శివారు కరీం నగర్ రోడ్డు లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గత 4 రోజులుగా అత్యంత వైభవవో పేతంగా సాగిపోతున్న మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఉర్రూతలూగిస్తూ సాగిపోతుంది.
కళ్యాణమండపం భక్తులతో కిక్కిరిసిపోయి జనసంద్రం లాగ కనిపిస్తుందని సామాజిక కార్యకర్త తవుటు... గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం
* ఏఐ మార్ఫింగ్‌తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం
* గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
* ఏఐ మార్ఫింగ్‌తో ఓటర్లలో అయోమయం
భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి.... ట్రాఫిక్ నిబంధనల పై యమధర్మరాజు అవగాహన : ట్రాఫిక్ పోలీసులతో కలిసిరోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) : రోడ్డు ప్రమాదాల పై అవగాహన కలిగించేందుకు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివేగం, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా యమధర్మ రాజు వేషదారితో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు.... చలనచిత్ర రంగ అభివృద్ధికి పూర్తి సహకారం — సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వము పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రెండో... రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
హైదరాబాద్ డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను విర్చువల్‌గా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో... గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే సదరు... పోష్ యాక్ట్–2013పై అవగాహన ర్యాలీ
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) :
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు కఠినంగా అమలు అవుతున్న పోష్ యాక్ట్–2013 గురించి అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా కమిటీ, యాక్షన్ ఎయిడ్, భరోసా సంయుక్తంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించింది. న్యూ బోయిగూడ నుంచి గాంధీ ఆస్పత్రి ఎదురుగా... రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మోడల్ స్కూల్ నందు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి సందర్శించినారు, మరియు అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ ని కూడా "అవినీతిని నిర్మూలిద్దాం- దేశాన్ని అభివృద్ధి చేద్దాం’’ 1064 టోల్ ఫ్రీ నెంబర్ తో అవినీతికి అడ్డుకట్ట జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 9 (ప్రజా మంటలు)అవినీతి నిరోధక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ అశోక్... ఆదం సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్..
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు):
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్, పండ్ల పంపిణీ,... బన్సీలాల్ పేట లో సోనియమ్మ 79వ జన్మదిన వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు):
సికింద్రాబాద్, బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని జబ్బర్ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఐత చిరంజీవి ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు.... ఎన్నికల కోడ్ నియమాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి :ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 09 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడంతో నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్ఐ,కృష్ణ సాగర్ రెడ్డి మళవారం మండలంలోని రాఘవపట్నం ,గుంజపడుగు, వెలుగుమట్ల ,చందోలి, దమ్మన్నపేట శ్రీరాములపల్లి గ్రామాలలో పర్యటించి ప్రజలకు ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అలాగే ఎన్నికల సమయంలో వాట్స్అప్... 