బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ
పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్
సికింద్రాబాద్ జూలై 09 (ప్రజా మంటలు):
ఆషాడ బోనాల జాతరను ఆయా ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆయా ఆలయాలకు అందించే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈమేరకు ఇటీవల బన్సీలాల్ పేట డివిజన్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి బోనాల జాతర చెక్కులు దుర్వినియోగం అవుతూ, పక్కదారి పడుతున్నాయని దేవాదాయ శాఖాధికారులకు ఆధారాలతో సహా పిర్యాదుచేశారు. ఈమేరకు స్పందించిన ఎండోమెంట్ అధికారులు మంగళవారం డివిజన్ లోని పలు ఆలయాలను సందర్శించి, విచారణ చేపట్టారు. పద్మారావునగర్ లో ఓచోట చెట్టుకింద అమ్మవారి ఆలయం లేకపోగా, అక్కడ టెంపుల్ ఉందని ఓ వ్యక్తి గత 8ఏండ్లుగా ప్రభుత్వం ఇచ్చే చెక్కులను తీసుకుంటున్నట్లు గుర్తించారు. అలాగే ఒకే టెంపుల్ పై రెండేసీ చెక్కులను తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన పద్మారావునగర్ పార్కు, వెంకటపురం కాలనీ,హమాలీబస్తీ,గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న పలు ఆలయాలను ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి,సురేశ్ లు సందర్శించారు. ఈమేరకు అక్కడి స్థానికులను అడిగి వివరాలు నమోదుచేశారు. చెక్కుల దుర్వినియోగంపై విచారణ పూర్తి అయిన వెంటనే పూర్తి స్థాయిలో నివేదికను ఎండోమెంట్ కమిషనర్ కు అందచేస్తామన్నారు. అవకతవకలకు పాల్పడిన టెంపుల్ నిర్వాహకులను గుర్తించి, వారికి వచ్చే ఏడాది నుంచి చెక్కుల పంపిణీని నిలిపివేస్తామన్నారు.
ఒక్కో టెంపుల్ నుంచి రెండేసీ చెక్కులను గత కొన్నేండ్లుగా తీసుకుంటున్న వారినుంచి ప్రభుత్వం ఇచ్చిన నిధులను రికవరీ చేసి,వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి ఎండోమెంట్ అధికారులను కోరారు. రికవరీ చేసిన నిధులను జెన్యూన్ గా ఉండే పెద్ద ఆలయాలకు ఇస్తే బోనాల ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంటుందన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
