ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు పోలీస్ పాఠశాల_అవగాహన కార్యక్రమము జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల జూన్ 12 ( ప్రజా మంటలు)
విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో “పోలీస్ పాఠశాల: యువ పౌరుల కోసం రోడ్డు భద్రత” వినూత్న కార్యక్రమం
“ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చుఅనే ఉద్దేశంతో *“పోలీస్ పాఠశాల: యువ పౌరుల కోసం రోడ్డు భద్రత”* అనే ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ గురువారం స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... “పిల్లలు మన భవిష్యత్తు. వారికి ఇప్పుడు సరైన అవగాహన కల్పిస్తే, రేపటి సమాజం మరింత భద్రమవుతుంది అనే ఉద్దేశంతో *“పోలీస్ పాఠశాల: యువ పౌరుల కోసం రోడ్డు భద్రత”* కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమ౦ యొక్క ప్రధాన లక్ష్యం
చిన్నారుల్లో రోడ్డు నియమాల పట్ల చైతన్యం పెంపొందించడం.
విద్యార్థులపై జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడం
విద్యార్థులను వారి ఇంట్లో, సమాజంలో “ట్రాఫిక్ భద్రత వారియర్స్ గా ” మారేందుకు ప్రోత్సహించడం.
పోలీసు మరియు విద్యార్థుల మధ్య స్నేహపూరిత సంబంధాన్ని ఏర్పరచడం
ఈ కార్యక్రమ౦ ద్వార నేటి ను౦డి ప్రతి వారం జిల్లాలోని ఒక్కో పాఠశాలకి పోలీసులు వెళ్లి విద్యార్థులతో ప్రత్యక్షంగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు సురక్షిత ప్రయాణ పద్ధతులు ,రోడ్డు పై ఎలా సురక్షితంగా నడవాలి, రోడ్డు దాటేటపుడు పాటించవలసిన నియమాలు ,సైకిల్ నడిపేటప్పుడు, కుటుంబ సభ్యులతో కారు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలు,హెల్మెట్, సీటుబెల్ట్ వాడక ప్రాముఖ్యత,రోడ్ల పై మొబైల్ వాడకం వల్ల జరిగే ప్రమాదాలు,రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు,అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక యాక్సిడెంట్ సంభవిస్తుందని ఈ యొక్క ప్రమాదాల ద్వారా చాలా మంది చనిపోవడం జరుగుతుందని ఈ ప్రమాదాలను నివారించడానికి విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వారికి వివరించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వారియర్స్ గా పని చేయాలని కోరారు.
ఈ యొక్క కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఐటికోర్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
