ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం
గొల్లపల్లి జూన్ 11 (ప్రజా మంటలు) :
గొల్లపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు గొల్లపల్లి మండలంకు సంబంధించిన 389 మందికి మంజూరు పత్రాల పంపిణీ చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్,జిల్లా ఆర్డీవో తో కలిసి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందజేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టి దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని,ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని,ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆరువందల స్క్వేర్ ఫీట్స్లో ఇంటి నిర్మాణం చేపట్టాలని దానికి అనుగుణంగా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని,పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో కొంత మంది లబ్ధిదారులు ఇంటి నిర్మానాణాలు ప్రారంభించడం లేదని,వారు కూడా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని,ఇంకా ఎవరైనా అర్హత ఉండి ఇల్లు రాని వారు ఉంటే నన్ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసూదన్ ,ఎస్సీ కార్పొరేషన్ కిషోర్ , తాసిల్దార్ వరంధన్ , మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఎంపీడీవో రామ్ రెడ్డి, సంబంధిత అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్క్ నిశాంత్ రెడ్డి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు

బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్

ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
