అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
మల్యాల మే 23(ప్రజా మంటలు)
నిరంతరం అధికారులకు, సిబ్బందికి వైర్లెస్ సెట్ ద్వారా సూచనలు చేస్తూ భక్తులకు సులభంగా మాల విరమణ,దర్శనం అయ్యేలా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నారు జిల్లా ఎస్పీ
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్బగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, అత్యవసర సేవల ఏర్పాట్లను సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేస్తూ, పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు, ఆదేశాలు ఇస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ, రాత్రి వేళల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఉండేలా, అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే స్పందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
అంతేకాక, భక్తులతో స్వయంగా మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో ప్రజల భద్రతే ముఖ్యమని, అన్ని విభాగాల సమన్వయంతో హనుమాన్ జయంతిని శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
