మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి
*పార్సిగుట్ట చోరి కేసును చేధించిన పోలీసులు
*మూడు తులాల బంగారు నగలు,మొబైల్ రికవరీ
*మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్ మే 04 (ప్రజామంటలు) :
వారాసిగూడ పీఎస్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన టు–లెట్ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. స్వయనా మేనకోడలే అత్త ఇంట్లో జరిగిన చోరి కేసులో ప్రధాన నిందితురాలని తేలింది. ఆదివారం సాయంత్రం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపిన వివరాలు..
పార్సిగుట్ట లో పారిజాతం(60) అనే మహిళ ఒంటరిగా అద్దెకు ఉంటుంది. ఆమె ఉంటున్న ఇంట్లో మరో గది ఖాళీగా ఉండటంతో ఇంటిముందు టు లెట్ బోర్డు పెట్టారు. ఈనెల 2న మద్యాహ్నం ఇద్దరు ఆగంతకులు ఇల్లు అద్దెకు కావాలని లోనికి వచ్చి పారిజాతంను కుర్చీలో కట్టేసీ, నోటికి బ్యాండేజీ వేసి కత్తులతో బెదిరించి మూడు తులాల బంగారం నగలు, ఒక మొబైల్ ఫోన్ ను ఎత్తుకెళ్ళారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న వారాసిగూడ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఎల్ల జ్యోతి(45) ఎలగరి శ్రీకాంత్(26), కొర్రోలు ఈశ్వర్(19)లు నిందితులుగా తేల్చారు. వీరిని ఆదివారం అదుపులోనికి తీసుకొని అరెస్ట్ చేశారు. పారిజాతం మేనకోడలు జ్యోతి తనకు పరిచయం ఉన్న శ్రీకాంత్ కు తన మేనత్త ఒక్కరే ఇంటిలో ఉంటారని,వెళ్ళి బంగారు నగలు చోరి చేయమని స్కెచ్ వేసింది.
జ్యోతి సలహా మేరకు శ్రీకాంత్ , తన ఫ్రెండ్ ఈశ్వర్ ను తీసుకొని వెళ్ళి ఈ చోరికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.అసలు సూత్రధారి జ్యోతి తో పాటు శ్రీకాంత్, ఈశ్వర్ లను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి చోరి చేసిన 3 తులాల బంగారు నగలు, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో చోరి కేసును చేధించి,చోరి సొత్తును రికవరీ చేసిన ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ రమేశ్ గౌడ్, ఎస్ ఐ లు సుధాకర్, ప్రకాశ్ రెడ్డి, క్రైమ్ కానిస్టేబల్స్ ఎండీ గాలేబ్,ఎమ్డీ దస్తగిరి,ఎస్.వేణు,బి.రామకృష్ణ,ఏ.దేవేందర్ నాయక్,జీ.రజిత,వినయ్,గణేశ్,కృష్ణ, లను డీసీపీ బాలస్వామి అభినందించి, రివార్డులను అందచేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
