మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.
సిరిసిల్ల రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 2(ప్రజా మంటలు)
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 20 లక్షల విలువగల 102 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.*
* సైబర్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 102 మొబైల్ ఫోన్లను ( సుమారు 20 లక్షల విలువగల ) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు.
పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్ లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు.ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 986 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ CEIR టీం RSI కృష్ణ ,హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు అజర్ యాకూబ్,మల్లేశం లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ గారికి చాలా ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
*సైబర్ మోసాలపైప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అజ్ఞాత వ్యక్తుల కు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ , RSI కృష్ణ, CEIR టీం హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్ అజర్,మల్లేష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
