125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం నివాళులర్పించాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కేసీఆర్ గారిపై కోపంతో రాజ్యాంగ నిర్మాతను అవమానించడం మంచిదికాదు. ముఖ్యమంత్రి గారే ముందుకు వచ్చి కేబినేట్ మంత్రులతో సహా అంబేద్కర్ స్మృతి వనానికి వెళ్లి నివాళులు అర్పించాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అమీర్ పేట్ వైశాకి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ ఏప్రిల్ 13:
నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రేపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారే ముందుకు వచ్చి కేబినెట్ మంత్రులతో సహా అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించి ఆ మహనీయునికి నివాళులర్పించాలని సూచించారు.
125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు ఏర్పాటు చేయించి ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ గారిపై కోపంతో విశ్వమేధావి అయిన అంబేద్కర్ ను అవమానించడం మంచిది కాదన్నారు.
ప్రపంచ దేశాలు డాక్టర్ అంబేద్కర్ ను గౌరవిస్తున్నాయని, మన పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ పక్కనే నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించకపోవడం సముచితం కాదన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఆయన పేరుతో నిర్మించిన సెక్రటేరియట్ కేంద్రంగా పాలన సాగిస్తూ కేసీఆర్ పై అక్కసుతో అంబేద్కర్ ను గౌరవించక పోవడం మంచిది కాదని సూచించారు.
గతేడాది అంబేద్కర్ జయంతికి ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని.ఏ ఒక్కరు కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించలేదని గుర్తు చేశారు. కనీసం ఆ మహనీయుని విగ్రహానికి ఒక్క పూలమాల కూడా వేయలేదన్నారు. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ముఖ్యమంత్రి గారే చొరవ చూపాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం గేట్లు తెరిచి ప్రజలు సందర్శించునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
అమీర్ పేట్ వైశాకి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
అమీర్ పేట్ లో ఆదివారం నిర్వహించిన వైశాకి వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సిక్కు సోదరులు ఈ సందర్భంగా కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ అన్ని కులాలు, మతాల వారు కలిసి మెలిసి సోదరభావంతో జీవించే రాష్ట్రమన్నారు. హైదరాబాద్ లో ఇంత వైభవంగా వైశాకి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో.హైదరాబాద్ లో సిక్కు ఫౌండేషన్ కోసం భూమి కేటాయించామని, గురునానక్ జయంతి రోజున సెలవు ప్రకటించామని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబానికి పరామర్శ
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ కుమార్ దంపతులు.పరామర్శించారు. షకీల్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆదివారం కవిత దంపతులు షకీల్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
