దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం.. భోగ శ్రావణి
గొల్లపల్లి ఏప్రిల్ 09 (ప్రజామంటలు):
కమల నిలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.జీవన్ రెడ్డి టీడీపీ నుంచి మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.నేను నా చైర్మన్ పదవికి అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బిజెపి పార్టీలో గౌరవప్రదంగా చేరాను.దొంగ రాత్రి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు 2018లో లక్ష ఓట్లు వచ్చాయి అని గర్వంగా చెప్పుకున్నారు కదా, 2023 లో 40వేల ఓట్లు ఎందుకు తగ్గాయి కోట్లు ఖర్చు పెడితే 8% ఓట్ల తేడాతో గెలిచారు.మరి అప్పటికీ ఇప్పటికీ ఓట్ల శాతం ఎందుకు తగ్గింది.నడమంత్రపు సిరి వస్తే ఎగిరి పడుతారంటారు.నువ్వు అనుభవిస్తున్న రాజకీయ జీవితం ప్రజల బిక్ష, నిన్ను నమ్మిన కార్యకర్తల కష్టం. మిమ్మల్ని గెలిపించిన నాయకులు జైలులో ఉన్న వాళ్ళను మర్చిపోయి దొంగరాత్రి దొంగలెక్క పోయి బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నీతులు మాట్లాడడం హాస్యాస్పదం.నిన్ను నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టావని బోగ శ్రవణి విమర్శించారు.
.సంజయ్ కుమార్ ది తెరిచినా పుస్తకం కాదు రాక్షస పాలన.జగిత్యాల లో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మీతోనే సాధ్యం.2017లో భూమి పూజ చేసిన డబుల్ ఇల్లు ఎందుకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పూర్తికాలేదు దానికి మీ బంధువులే కదా కాంట్రాక్టర్లు 4 వేల నుండి 43 వేల ఓట్లు మా కార్యకర్తల కష్టం మరియు పార్టీ సపోర్ట్ ప్రజలు దీవించి ఇచ్చిన గౌరవప్రదమైన తీర్పు అది.స్థానం గురించి మాట్లాడుతున్నారు కదా ప్రజలు నీపై ఉన్న అభిప్రాయం ఇటీవల జరిగిన సర్వేలో మిమ్మల్ని 108వ స్థానంలో ఉంచారు అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి.బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఏ పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంటావో తెచ్చుకో నేను బిజెపి తరపున నిలుచుంటా పోటీ చేస్తా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా. సవాలు విసిరారు.
ఇటీవల కొన్ని మీడియా పత్రికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్థాయి గురించి మాట్లాడినందుకు గాను డాక్టర్ బోగ శ్రావణి ఎమ్మెల్యే మాటలకు చురకలు అంటించారు.
ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాం జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యేకి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెబుతారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చిన్నారి స్నేహమా....చిగురించే కాలమా.... అలనాటి మధుర స్మృతులు

నీటి సంపులో పడి బాలుడు మృతి

మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.

నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..... సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి

కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక
