రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్ ఏప్రిల్ 08:
బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా విశిష్ట సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆదర్శవంతమైన దాది జీ జీవితం ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడారు. వారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా, మార్గదర్శిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.
దాది జీ గారు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో విస్తరింపజేసి, సమాజానికి శాంతి, మానవతా విలువల సందేశాన్ని అందించారని గుర్తుచేసుకున్నారు. దాది జీ గారి మృతి రాష్ట్రానికి, దేశానికి, ఆధ్యాత్మిక విశ్వానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. దాది రతన్ మోహినీ జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
