రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్ ఏప్రిల్ 08:
బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా విశిష్ట సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆదర్శవంతమైన దాది జీ జీవితం ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడారు. వారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా, మార్గదర్శిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.
దాది జీ గారు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో విస్తరింపజేసి, సమాజానికి శాంతి, మానవతా విలువల సందేశాన్ని అందించారని గుర్తుచేసుకున్నారు. దాది జీ గారి మృతి రాష్ట్రానికి, దేశానికి, ఆధ్యాత్మిక విశ్వానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. దాది రతన్ మోహినీ జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..... సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి

కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్
