సన్న బియ్యం పంపిణీ లో పాల్గొన్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి ఎప్రిల్ 05 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా శనివారం గొల్లపల్లి మండల కేంద్రంలో రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అధికారులు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.గత 10 సంవత్సరాల బి.ఆఎస్.ఎస్ పాలకుల అరాచక పరిపాలనకు చరమ గీతం పడే విధంగా రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని,రాష్ట్ర ప్రజల ఆశాలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనను కొనసాగించడం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబియ్యమైతే తింటున్నారో రాష్ట్ర ప్రజానీకం కూడా అదే బియ్యం తినాలన్న సంకల్పం తో ఒక్కో రేషన్ కార్డు పైన ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని అందించడం జరుగుతుందని, తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వనికి ధన్యవాదాలు తెలిస్తున్నామని,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్,500 గ్యాస్ సిలిండర్,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని,గత ప్రభుత్వంలో పాలకులు ప్రజలకు సన్నబియ్యం అందించాలన్న ప్రయత్నం కూడా చేయలేదని,మన ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది ఆన్నార్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మస్క్ నిశాంత్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారులు నిత్యానందం, తాసిల్దార్ వరంధన్, నాయబ్ తాసిల్దార్ వినోద్,ఆర్ ఐ జీవన్, డీలర్ గాజింగి రాజేశ్వరి, లంబ లక్ష్మణ్, మాజీ సర్పంచులు ఉప సర్పంచులు హరికిరణ్, వెంకటేష్ గౌడ్ , నాయకులు రంగు శ్రీనివాస్ గౌడ్, దాసరి తిరుపతి, మండల డీలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
