జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ కౌన్సిలర్ జయశ్రీ లేఖ
జగిత్యాల ఎప్రిల్ 03:
జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు జగిత్యాల పట్టణ 35 వ వార్డు మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ లేఖ రాసారు.
జగిత్యాల నుండి కరీంనగర్ నేషనల్ హైవే "563" నాలుగు లైన్ల రహదారి గురించి జగిత్యాల పట్టణ మరియు కరీంనగర్ పట్టణాన్ని కలుపుతూ ఉన్న అన్ని మండలాల ప్రజలు మరియు గ్రామాల ప్రజల దశాబ్దాల కల అయిన ఈ రోడ్డును 2014 లో గుర్తించినప్పటికీ గతంలో ఉన్న M.P పట్టించు కోకపోవడంతో ప్రస్తుతం B.J.P. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిగా మీరు కరీంనగర్ M.P గా గెలవడంతో ఇక్కడి ప్రజలు అందరు కూడ మా కల నేరవేరుతుందని అనుకున్న ప్రజల కలలు, కలలు గానే మిగిలి పోయాయni లేఖలో పేర్కొన్నారు.
మెన్నటికి మొన్న ప్రధాన మంత్రిగా "3వ " సారి "నరేంద్ర మోడీ" గారు బాద్యతలు తీసుకున్న "100" రోజుల ప్రణాళికలో భాగంగా ప్రమాదకరముగా ఉన్న రోడ్లు, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నరోడ్లను గుర్తించిన రోడ్లలో మన జగిత్యాల నుండి కరీంనగర్ రోడ్డును గుర్తించి "100" రోజుల లోపు పనులు మొదలు పెట్టాలని చెప్పి ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడం చాల బాధాకరమని అన్నారు.
జగిత్యాల నుండి కరీంనగర్ రోడ్ కు ఇప్పటి వరకు పూర్తిస్థాయి భూసేకరణ కాలేదని మరియు ఇప్పటి వరకు నాలుగు సార్లు టెండర్లు పిలిచినారని వాటిని రద్దు పరుస్తు వస్తున్నారు. ఈ రోడ్డు అయ్యే ఖర్చు మొదటి అంచనా 1503 కోట్ల రూపాయలుగా తిరిగి మళ్ళీ టెండర్ అంచనా వేయగా రూ,, 2,151కోట్లకు అంచనా, June, 2024 నాటికి అంచనా విలువ 2, 300 కోట్ల రూపాయలకు చేరుకుంది, సంవత్సరాలు గడిచిన కొద్ది అంచనా విలువ పెరుగుతూ వస్తుంది. కానీ, ప్రజలకు అవసరమయిన రోడ్డు పనులకు టెండర్ కాకపోవడం శోచనీయం. వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో నిత్యం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూ కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా పూర్తి స్థాయి బాద్యతగా తీసుకొని సమయాన్ని వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంబించే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల ప్రజలు మరియు జగిత్యాల నుండి కరీంనగర్ వరకు ఉన్న ప్రజలందరి పక్షాన కోరుతున్నానని హనుమండ్ల జయశ్రీ లేఖలో కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా
