మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు
On
పైప్ లైన్ లీకేజీలు - పట్టించుకోని అధికారులు
అధికారుల నిర్లక్ష్యం - ఆగ్రహిస్తున్న ప్రజలు
బుగ్గారం ఏప్రిల్ 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట మిషన్ భగీరథ నీరంతా మురికి కాలువల పాలౌతోంది. గత కొన్ని నెలల నుండి
పైపు లైన్ లీకేజీలతో నీరంతా రోడ్డు మీద పారుతూ మురికి కాలువల్లోకి చేరుతుంది. నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా పలు చోట్ల ఇలాగే లీకేజీలయ్యి నీరంతా వృధా కావడం జరుగుతుందన్నారు. నీరంతా కలుషితం అయినా అధికారుల్లో ఎలాంటి చలనం రావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపు లైన్ లీకేజీలకు మరమ్మత్తులు చేపట్టి అత్యంత విలువైన నీటిని వృధా కాకుండా, కలుషితం కాకుండా కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాల నుండి సంభందిత ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారి వివేకానంద గౌడ్ (వివేక్) కు, మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా కు, సంబంధిత కాంట్రాక్టర్ పందిరి తిరుపతి లకు ఎన్ని విజ్ఞాపనలు చేసినా ఫలితం శూన్యం అయిందని విడిసి ఆరోపణలు చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే మిషన్ భగీరథ నీరు మురికి కాలువల పాలు అవుతుందని గ్రామ అభివృద్ది కమిటీ ఆరోపిస్తోంది. నీరు కలుషితం అయి ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారని, లీకేజీ ల వల్ల రోడ్లు బురద మయం అయ్యి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామ అభివృద్ది కమిటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. వేసవి కాలంలో తీవ్ర నీటి కొరత సమయంలో కూడా అధికారులు నిర్లక్యంగా వ్యవహరించి ఇలా నీటిని వృధా చేయడం దారుణం అని, ఇది వారి విధుల దుర్వినియోగానికి కూడా అద్దం పడుతోందని మండల అభివృద్ధి కమిటీ కన్వీనర్ చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు చేసినా అధికారుల్లో, సంబంధిత కాంట్రాక్టర్ లో ఎలాంటి చలనం రాకపోవడం, దున్న పోతు మీద వర్షం పడ్డట్లుగా ఉందని ఆయన మండి పడ్డారు.
ఎవరికి చెప్పినా పట్టించుకున్న నాథుడే లేడు
-చుక్క జలపతి - బుగ్గారం
మా బుగ్గారంలో మిషన్ భగీరథ నీరంతా పైపు లైన్ లీకేజీలతో వృధా అవుతుందని, ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఏ అధికారికి చెప్పినా, ఎవరికి చెప్పినా పట్టించు కోవడం లేదు. త్రవ్విన చోటే మళ్ళీ - మళ్ళీ గోతులు త్రవ్విండ్రు. కానీ పైప్ లైన్ లీకేజీలు అయితే సరి చేయలేదు. గత మూడు - నాలుగు ఏండ్లుగా గ్రామస్తులంతా ఎన్నో ఇబ్బందులు పడ్డా అధికారులు సరిగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మా సమస్యలు తీర్చాలి. విలువైన మిషన్ భగీరథ నీరు వృధా కాకుండా, కలుషితం కాకుండా చూసి ప్రజలను ఆదుకోవాలి.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.
Published On
By Siricilla Rajendar sharma

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం
Published On
By Special Reporter

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
Published On
By Kasireddy Adireddy

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
Published On
By Special Reporter

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం
Published On
By Special Reporter

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
Published On
By Special Reporter

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం
Published On
By Siricilla Rajendar sharma

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు
Published On
By Special Reporter

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం
Published On
By Special Reporter

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము
Published On
By Special Reporter

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా
Published On
By Special Reporter
