నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్
ఆస్పత్రిలో A R కానిస్టేబుల్ ఆత్మరక్షణ కోసమే కాల్పులు
నిజామాబాద్ అక్టోబర్ 20 (ప్రజా మంటలు):
నిజామాబాద్ లో పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి కారణమైన నిందితుడు రియాజ్, ఆస్పత్రిలో జరిగిన కాల్పులలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఈనెలలో జరిగిన ఘటన నుండి తప్పించుకొని పారిపోయిన రియాజ్ ను నిన్న, సారంగాపూర్ దగ్గర పోలీసులు పట్టుకొన్నారు. ఈసందర్భంగా జరిగిన పెనుగులాటలో రియాజ్ కు గాయాలైనట్లు,అందుకే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.ఈఘటనలో సాధారణ పౌరుడు ఆసిఫ్ కు కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి.
రియాజ్ పై దాదాపు 40 దొంగతనాల కేసులు, బైక్ ఎత్తుకెళ్లిన కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రియాజ్ ను ఆస్పత్రిలోని కదల వార్డులో 407 గదిలో ఉంచారు. అక్కడ ఈరోజు కాపలాగా ఉన్న ఈ ఆర్ కానిస్టేబుల్ నుండి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపి, పారిపోవడానికి చేసిన ప్రయత్నంలో, కానిస్టేబుల్ జరిపి కాల్పులలో రియాజ్ మరణించినట్లు, సీపీ సాయి తెలిపారు.
ఈఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, నిందితుడు రియాజ్ మృతి, పోలీసుల ఆత్మరక్షణ కొరకు చేసిన కాల్పులలో మరణించాడని, ఒక బుల్లెట్ s ఆస్పత్రి సీలింగ్ కూడా ఒక బుల్లెట్ తగిలిందని తెలిపారు.
అలాగే, మృతుడు ప్రమోద్ కుటుంబని కోటి రూపాయల పరిహారంతో పాటు, ఆయన పదవి విరమణ వయసు వరకు పూర్తి వేతనంతో పాటు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని శివధర్ రెడ్డి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
