నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య
బైక్ దొంగను తరలిస్తుండగా కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో,కానిస్టేబుల్ ప్రమోద్ ఘాట్ గాయాలతో మృతి, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ అక్టోబర్ 19 (ప్రజా మంటలు):
వినాయక్ నగర్‌లో పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్‌పై శుక్రవారం సూక్ష్మ కత్తితో దాడి జరిగింది. బైక్ దొంగతనాల్లో నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని ,స్టేషన్‌కు తరలించే సమయంలో ఇతను బెదిరింపు చేసి, ఆకస్మికంగా కానిస్టేబుల్‌పై దాడి చేసి గాయపరిచాడు.
తీవ్ర గాయాలపాలైన ప్రమోద్‌కు స్థానిక హాస్పిటల్‌లో చికిత్స కొరకు తరలించారు. చికిత్సలో అతను ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనలో ఎస్‌ఐ విఠల్ కు కూడా గాయాలు అయ్యాయి. రియాజ్, ఘటన తరువాత కారులోంచి పారిపోయినట్టు పోలీసులు తెలుపుతున్నారు.
రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఈ హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశంతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితుడిని పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. బాధితుల కుటుంబానికి అండగా ఉండేందుకు స్థానిక సీపీ సాయి చైతన్య ప్రభుత్వం మరియు పోలీస్ డిపార్ట్‌మెంట్ తరఫున అవసరమైన సహాయాలు, బెనిఫిట్స్ అందిస్తామనే హామీ ఇచ్చారు. రియాజ్ ను పట్టించినవారికి, సీపీ సాయి చైతన్య 50,000 రూపాయల రివార్డ్‌ను కూడా ప్రకటించారు.
స్థానికులు సంఘటనకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . కొంత మంది వ్యక్తులు కానిస్టేబుల్ చావుబతుకుల్లో ఫోటోలు, వీడియోలు తీస్తూ నిర్లక్ష్యంతో వ్యవహరించడాన్ని జనం ఖండించారు. సీఐ వ్యాఖ్యల ప్రకారం ఇదో సామాజిక సమస్య అన్నట్టు, ఎవరు సహాయాన్ని అందించకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి - చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు
