రాజీమార్గంలో వివాదాలు పరిష్కరించుకోవడమే మేలు - జిల్లా జడ్జి రత్న పద్మావతి
జగిత్యాల సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):
జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయడం లో కృషి చేసిన పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించిన జిల్లా జడ్జి రత్న పద్మావతి ప్రశంసా పత్రాలు అందజేసారు.
రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి ఈనెల 13న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో, జిల్లా పరిధిలో 3214 కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ వారిని జిల్లా జడ్జి శ్రీమతి రత్న పద్మావతి అబినందించారు. వారికి
ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణం లో ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీమతి రత్న పద్మావతి మాట్లాడుతూ, పోలీస్ అధికారులు, బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది ఎంతో కష్టపడి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున ఈ కేసులు పరిష్కరించబడినాయని అన్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన బార్ అసోసియేషన్, పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందిస్తూ, రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పని చేయాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు జిల్లా జడ్జి నారాయణ, సెక్రటరీ లీగల్ సెల్ వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ, శ్రీనిజ కొహిర్కార్, మేజిస్ట్రేట్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు మరియు జగిత్యాల జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
