గాంధీ మెడికల్ కాలేజ్‌లో రాష్ట్ర స్థాయి ఈఎన్టీ వైద్యుల సదస్సు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 21 (ప్రజామంటలు) :
తెలంగాణ ఈఎన్టీ వైద్యుల సంఘం (ఏఓఐ) ,గాంధీ మెడికల్ కాలేజ్ ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన AOI TG CON–2025 రాష్ట్ర స్థాయి ఈఎన్టీ వైద్యుల రెండు రోజుల సదస్సు ఆదివారం ముగిసింది. రెండు రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణులు, శస్త్రచికిత్స వైద్యులు, పరిశోధకులు, యువ వైద్యులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతలు, కొత్త చికిత్సా విధానాలు, తాజా పరిశోధనలు పై విస్తృత చర్చలు జరిగాయి. ఈఎన్టీ యొక్క అన్ని ఉప-విభాగాలు ఓటాలజీ, రైనాలజీ, లారింజాలజీ, హెడ్ & నెక్ ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈఎన్టీ , స్కల్ బేస్ సర్జరీ, ఎండోస్కోపిక్ & రోబోటిక్ సర్జరీలపై జరిగిన చర్చలో వైద్యులు పాల్గొన్నారు. యువ వైద్యులకు శాస్త్రీయ పత్రాల ప్రదర్శనలు, పోస్టర్ ప్రెజెంటేషన్స్ ద్వారా అనుభవం పెంచే అవకాశం కల్పించారు. ఆధునిక వైద్య పరికరాల ప్రదర్శన కూడా సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ..ఈ సదస్సు ద్వారా యువ వైద్యులకు అత్యాధునిక పరిజ్ఞానం చేరుతుందని,రోగులకు మెరుగైన చికిత్సా విధానాలు అందించడంలో ఇది సహకరించనుందన్నారు.
వైద్యుల మధ్య అనుభవాల మార్పిడి, పరిశోధన, సేవా రంగాల్లో కొత్త మార్గాలు సుగమం అవుతాయన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి, తెలంగాణ ఈఎన్టీ వైద్యుల సంఘం రాష్ర్ట అద్యక్షులు డాక్టర్ శోభన్ బాబు, రాష్ర్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, వైస్ ప్రెసిడెంట్ డా.రమేశ్,సెక్రటరీ డా.ఆనంద్ తో పాటు దాదాపు 700 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన
