అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ని గృహనిర్బంధం చేసిన పోలీసులు
సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు) :
రంగారెడ్డి జిల్లాలోని అనాజ్ పూర్ గ్రామంలో పేదలకు చెందిన 125 ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈ మేరకు శనివారం అనాజ్ పూర్ గ్రామానికి చెందిన రైతులు స్థానికులు చలో అసెంబ్లీ పిలుపు ఇవ్వడంతో బోలక్ పూర్ లోని సిపిఎం కార్యాలయంలో గాంధీనగర్ పోలీసులు జాన్ వెస్లీని గృహ నిర్బంధం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రామోజీ ఫిలిం సిటీ సమీపంలో ఉన్న అనాజ్ పూర్ గ్రామస్తులకు అనేక ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 125 ఎకరాలను పేద రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు తాజాగా అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 125 ఎకరాల భూమిని తిరిగి లాక్కుని దానిని టూరిజం డెవలప్మెంట్ పేరుతో రామోజీ ఫిలిం సిటీకి అప్పగించాలని చూస్తున్నదని అన్నారు. దీనిపై అక్కడ రైతులు కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, వారికి తాము మద్దతుగా నిలిచావని అన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలలో ఉన్న రామోజీ ఫిలిం సిటీ లో సినిమా షూటింగ్ ల వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు ఆదాయాన్ని సంపాదిస్తుందని, వారికి అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 350 ఎకరాలను వారికి అప్పగించడానికి కుట్ర పన్నిందని అన్నారు.
ప్రస్తుతం అక్కడ ఎకరానికి రూ.5 కోట్ల విలువ కలిగి ఉన్నదని, అందుకే అనాజ్ పూర్ కు చెందిన పేద రైతుల భూములను లాక్కుంటుందని, వారికి పట్టా పుస్తకాలు కూడా ఇవ్వడం లేదని, భూమి యజమానుల వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి చలో అసెంబ్లీ చేపట్టిందని, వారికి న్యాయం లభించేంతవరకు సిపిఎం పార్టీ వారికి అండగా నిలబడి న్యాయ పోరాటంలో పాల్గొంటుందని జాన్ వెస్లీ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
