చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..
ఏడాది జైలు శిక్షతో పాటు జరిమాన- బాధితుల్లో హర్షం..
సికింద్రాబాద్, జూలై 17 ( ప్రజామంటలు):
చిట్టీల పేరిట మోసం చేసిన దంపతులకు జైలుశిక్ష, జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పదేళ్ల తర్వాత నిందితులు కటకటాల్లోకి వెళ్ళడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిలకలగూడ ఏపీసీ శశాంక్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. పార్శిగుట్టకు చెందిన డీ రవీందర్, సుజాతలు భార్యభర్తలు. 2015 లో ఇంటివద్ద ఉంటునే చిట్టీల వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో తక్కువ మొత్తాలకు చిట్టీలు వేసి సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించి స్థానికుల్లో నమ్మకం సంపాదించారు. తర్వాత పెద్దమొత్తంలో చిట్టీలు ప్రారంభించి ఎక్కువ మందిని చేర్చుకున్నారు. కాల పరిమితి ముగిసినప్పటికీ చిట్టీ డబ్బులు చెల్లించకుండా, అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ఆశ పెట్టారు. 25 నుంచి 40 మంది వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశారు. హఠాత్తుగా ఓ రోజు బోర్డు తిప్పేసి పరారయ్యారు. దీంతో నష్టపోయిన వారంతా లబోదిబో మంటు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు శాంతితోపాటు పలువురి ఫిర్యాదు మేరకు ఆర్ధిక మోసానికి పాల్పడిన భార్యభర్తలు రవీందర్, సుజాతతోపాటు సహకరించిన శంకర్, రాజేశ్వర్‌లపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారిగా అప్పటి ఎస్‌ఐ పెండ్యాల జయశంకర్‌వ్యవహరించారు. పరారైన నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టి ఆధారాలను అందించారు.
సుమారు పదేళ్ల పాటు కేసు నడిచింది. వాదోపవాదాలు విన్న తర్వాత సికింద్రాబాద్19వ అడిషనల్‌చీఫ్‌జ్యుడిషియల్‌మెజిస్ట్రేట్‌అరుణ గురువారం తీర్పు వెలువరించారు. చిట్టీల పేరిట మోసానికి పాల్పడిన భార్యభర్తలు రవీందర్, సుజాతలకు ఏడాది జైలుశిక్ష, రూ. 500 జరిమాన విధిస్తు ఆదేశాలు జారీ చేశారు. వీరికి సహకరించిన శంకర్, రాజేశ్వర్‌లపై కేసు కొట్టివేశారు. ఈ కేసులో అసిస్టెంట్‌పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌గా జే భార్గవి, సీడీఓగా బీ శ్రీనివాస్‌లు వ్యవహరించారు.ఈకేసు అప్పట్లో స్థానికంగా సంచలనం రేపింది. :
More News...
<%- node_title %>
<%- node_title %>
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన గ్రామ కుల సంఘాల పెద్దలు

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా
