తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు
మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట నాయకుల ఆందోళన
హైదరాబాద్ జూలై 14: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో ఈమేరకు ఫిర్యాదు చేశారు.
చైర్ పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో కమిషన్ సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాకు ఫిర్యాదు అందజేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా చైర్మన్ అందుబాటులో లేకపోవడంపై జాగృతి నాయకులు అసహనం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ అందుబాటులో లేరని చెప్తూ సెక్రటరీ సైతం ఫిర్యాదు లేఖను తీసుకోవడానికి అంగీకరించలేదని.. మహిళలను కించపరిచే వ్యక్తుల విషయంలో ఇలాంటి వైఖరి మంచిది కాదన్నారు. సభ్యులు స్పందించి ఫిర్యాదును చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లి తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో మహిళా జాగృతి అధ్యక్షురాలు మరిపల్లి మాధవి, సీనియర్ నాయకులు వరలక్ష్మీ, పడాల మనోజ, దేశపాక సుచిత్ర, సంధ్య రెడ్డి, షాహీన్, పరమేశ్వరి, కుసుమ రజిత, రజితా రెడ్డి తదితరులు ఉన్నారు.
మహిళా కమిషన్ ఎదుట నాయకుల ఆందోళన
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమను కమిషన్ లోపలికి అనుమతించకపోవడంపై తెలంగాణ మహిళా జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కమిషన్ గేట్లు మూసేశారని, తమను ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. రెండు గంటల పాటు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఎండలో బైఠాయించి ఆందోళనకు దిగారు. మహిళలను కించపరిచిన వ్యక్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా అని ప్రశ్నించారు. కమిషన్ చైర్ పర్సన్ జోక్యం చేసుకొని కొందరు నాయకులను లోపలికి అనుమతించడంతో ఆందోళన విరమించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
