ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
హైదరాబాద్ జూలై 14:
ప్రముఖ సినీనటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87),బెంగళూరు లోని తన నివాసంలో సోమవారం రోజు ఉదయత్పూర్వం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయింది.
ఆమ్పఈ తెలుగుతో పాటు, భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ నటి మృతి వార్త చలనచిత్ర రంగాన్ని విషాదంలో ముంచింది.
1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన బి. సరోజా దేవి,ఆమె నటనా ప్రతిభ, అభినయ నైపుణ్యం, చారిత్రక, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేశాయి. సౌందర్యానికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ నటి, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ వంటి అనేక భాషల్లో సూపర్‌స్టార్ల సరసన నటించారు.
తెలుగులో బి. సరోజాదేవి, ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, కాంతారావు, కృష్ణ వంటి దిగ్గజులతో కలిసి పనిచేశారు. ఇంటికి దీపం ఇల్లాలే,మంచి చెడు,దాగుడు మూతలు,ఆత్మబలం,పండంటి కాపురం,దాన వీర శూర కర్ణ,,అల్లుడు దిద్దిన కాపురం.. వంటి సినిమాల్లో ఆమె పాత్రలు మహిళా బలాన్ని, కుటుంబ విలువలను, భర్త పట్ల నిబద్ధతను ప్రతిబింబించేలా రూపొందాయి. ఆమె చిలిపితనం, హుందాతనం కలగలిపినై నటన ద్వారా ప్రేక్షకులు సహజత్వాన్ని, గొప్ప భావోద్వేగాన్ని అనుభవించారు.
బి. సరోజాదేవి సినీరంగానికి చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో గౌరవించింది. అనేక రాష్ట్ర, జాతీయ అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. తAMIL, కన్నడ, తెలుగు చలనచిత్ర పరిశ్రమల నుంచి ఆమెకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు లభించాయి. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బి. సరోజాదేవి వెండితెరపై చూపించిన విలక్షణమైన నటన, శీలవంతమైన ప్రవర్తన, విలువలతో కూడిన పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. బి. సరోజాదేవి మిగిల్చిన కళా వారసత్వం భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
