విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
హైదరాబాద్ జూలై 13:
విలక్షణ నటుడు, 750 చిత్రాలలో నటించిన కోట శ్రీనివాస్ రావు (1942 జులై 10 - 2025 జులై 13) కన్నుమూశారు..
కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు.. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు.. ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగిన కోట.. ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు..
సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసిన కోట శ్రీనివాసరావు.. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోట.. 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం.. 9 నంది అవార్డులు అందుకున్న కోట.. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ కోట శ్రీనివాసరావు జులై 10, 1942న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.ఇతని తండ్రి, కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట సీతారామాంజనేయులు వైద్యుడు.
కోట శ్రీనివాసరావు గారు 83 ఏళ్ల వయస్సులో 2025 జులై 13న హైదరాబాదులో తుదిశ్వాస విడిచాడు.
కోటగారి గురించి కొన్ని జీవిత విశేషాలు:
అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. మాజీ రాజకీయవేత్తగా, శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేసాడు.అతను 750కి పైగా చలన చిత్రాలలో నటించాడు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గానూ SIIMA అవార్డును అందుకున్నారు.
2015లో, అతను భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.
అతను S/O సత్యమూర్తి (2015), అత్తారింటికి దారేది (2013), రక్త చరిత్ర (2010), లీడర్ (2010), రెడీ (2008), పెళ్లైన కొత్తలో (2006), సర్కార్ (2006) వంటి చిత్రాలలో తన విభిన్న పాత్రలకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు., బొమ్మరిల్లు (2006), ఛత్రపతి (2005), అతడు (2005), ఆ నలుగురు (2004), మల్లీశ్వరి (2004), ఇడియట్ (2002), పృధ్వి నారాయణ (2002), చిన్నా (2000), గణేష్ (1998), అనగనగా ఒక రోజు (1997), లిటిల్ సోల్జర్స్ (1996), ఆమె (1994), హలో బ్రదర్ (1994), తీర్పు (1994), గోవింద గోవింద (1993), గాయం (1993), డబ్బు (1993), శత్రువు (1990), శివ (1989), అహ నా పెళ్లంట (1987), ప్రతిఘటన (1986),, రేపాటి పౌరులు (1986). 2003లో, అతను సామితో తమిళ పరిశ్రమలో ఒక విలన్‌గా అరంగేట్రం చేశాడు.
జీవిత విషయాలు:
అతను కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు. కోట 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఇతను స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోట ప్రసాద్ (1969-2010) 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రసాద్ జె.డి.చక్రవర్తి దర్శకత్వంలోని సినిమా సిద్ధంలో నటించాడు. 2010లో గాయం - 2 లో తన తండ్రితో పాటు నటించాడు.
కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఐదు నంది పురస్కారాలు అందుకున్నాడు.
కోటశ్రీనివాసరావు సోదరుడు కోటశంకరరావు కూడా సినిమా నటుడు. అతను జాతీయ బ్యాంకులో పనిచేసేవాడు. సోప్ ఒపేరాస్ లో కూడా నటించాడు.
అవార్డ్స్ :
పద్మశ్రీ పురస్కారం - 2015: 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుతం సత్కరించింది.
నంది ఉత్తమ విలన్- గణేష్ (1998),
నంది ఉత్తమ విలన్ - చిన్న (2000),
నంది ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002),
నంది ఉత్తమ సహాయ నటుడు - ఆ నలుగురు (2004)అయో
నంది ఉత్తమ సహాయ నటుడు - పెళ్లైన కొత్తలో (2006).
సినీరంగ ప్రవేశం:
బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.
అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. కోట శ్రీనివాసరావు ప్రతినాయక పాత్ర పోషించారు. యోగి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖి సినిమాలో ఎన్టీఆర్కు తాతగా నటించారు మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్కు తాతగా నటించారు. కోట శ్రీనివాసరావు గబ్బర్ సింగ్ లో శ్రుతిహాసన్ కు తండ్రిగా నటించారు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ తో కలిసి చాలా సినిమాలలో జోడిగా నటించారు. కోట శ్రీనివాసరావు రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోట శ్రీనివాసరావు కీలకపాత్రలో నటించారు. కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు.
కోట శ్రీనివాసరావుగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుతూ వారి కుటుంబానికి పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
