నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ
మండల అధ్యక్షులు శ్రీ రామోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ
భీమదేవరపల్లి మండలంలో కేక్ కట్, పండ్ల పంపిణీ, సామాజిక సేవ కార్యక్రమాలు
ప్రజామంటలు, ముల్కనూర్:
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని భీమదేవరపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భాజపా భీమదేవరపల్లి మండల అధ్యక్షుడు శ్రీ రామోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మండల కేంద్రం ముల్కనూర్‌లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం ముల్కనూర్ సుధాకర్ మెమోరియల్ హాస్పిటల్‌లో డాక్టర్ సుధాకర్ సమక్షంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కూడా పండ్లు అందించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, బండి సంజయ్ గారు నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడని, ఆయన సేవలే మనందరికీ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం MEO ద్వారా పంపిన జాబితా ప్రకారం ఈ నెలలోపే సంబంధిత పాఠశాలల్లోనే సైకిళ్లు అందజేయనున్నట్లు తెలిపారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు మోడీ కిట్‌లు త్వరలోనే అందించనున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృధ్వీరాజ్, సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, దుర్గాసింగ్, జిల్లా నాయకులు ఊస కోయిల కిషన్, దొంగల వేణు, పోడేటి బిక్షపతి, మండల నాయకులు ములుగు సంపత్, దొంగల రాణాప్రతాప్, బండారి కరుణాకర్, రఘు నాయకుల ప్రదీప్ రెడ్డి, కంకల సదానందం, బొజ్జపురి పృథ్వీరాజ్, లక్కిరెడ్డి మల్లారెడ్డి, మహిళా నాయకురాలు అంబీర్ కవిత, చరిష్మా, అలుగు భాస్కర్, కాలేరు వికాస్, ముండేడ్ల విజయ్, గుములాపురం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
