కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలి కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలి
ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ జూలై 07:
ఇటీవల కాలంలో వరుసగా జరుగుతోన్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయని,విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారని,కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని. క్రమేణ వృత్తి పని చేస్తున్న వారికి ఉపాధి లేకుండా పోయి, వారి జీవనం నడవడమే ఇబ్బందికరంగా మారిందని, దానికి తోడు పోలీసుల కేసులతో ఆత్మహత్యలకు పాల్పడం చాలా దౌర్భాగ్యమని, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వర్ణకారులు కోరారు.
ఈ విషయంలో ఆమ్మఈ తన ప్రకటనలో ఇలా తెలిపారు.:
దేశంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.. నగలను ఎంతో పవిత్రగా చూస్తారు.. కేవలం స్వర్ణకారులే కాకుండా ఇతర కులాల వారు కూడా ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నారు
మహిళగా మెట్టెలు, మంగళసూత్రాలు చేయించాలంటే స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తామే తప్ప పెద్ద పెద్ద షాపులకు వెళ్లం.. భారతీయులు పవిత్రంగా భావించే బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది
దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. ఆ బంగారం అమ్మిన దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారు
పోలీసుల వేధింపులు తట్టుకోలేక కొందరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు
నేను నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నా.. స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్న 411 చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్న
తెలంగాణతో పాటు ఏపీలోనూ 411 చట్టం కింద కేసులు పెట్టి స్వర్ణకారులను వేధిస్తున్నారు.. ఎమ్మెల్సీగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బీసీల కోసం ఉద్యమిస్తున్న నాయకురాలిగా ఈ చట్టం సవరణ కోసం పోరాడుతా
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చినట్టుగా స్వర్ణకారులతో పాటు అన్ని చేతివృత్తిదారులను ఆదుకునే చర్యలు చేపట్టాలి.. అప్పుడే వారు కార్పొరేట్ సంస్థలతో దీటుగా నిలబడగలుగుతారు
కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారు.. అలాంటి నకిలీ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.. లేదా మీ సమీపంలోని నాయకులను ఆశ్రయించండి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. మీరు బతికి ఉంటేనే ఏదైనా సాధించగలమనేది గుర్తించాలి.. బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వగలమని గుర్తించండి.. సోదరిగా మీమ్మల్ని కోరుతున్న ఆత్మహత్యలు చేసుకోవద్దు
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
