బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్
- లేని ఓ టెంపుల్ కు 8 ఏండ్ల నుంచి చెక్కులు
- మరికొన్ని టెంపుల్లో ఒక్కో దానికి రెండేసి చెక్కులు
- విచారణ ప్రారంభించిన ఎండోమెంట్ అధికారులు
- ఉన్నతాధికారులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు..
సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు) :
ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చే చెక్కులు గత కొన్నేండ్లుగా పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ పరిధి బన్సీలాల్‌పేట డివిజన్ పద్మారావునగర్ ఓ అపార్ట్ మెంట్ పక్కనున్న ఓ ఖాళీ స్థలంలో టెంపుల్ పేరుపై ఓ వ్యక్తి గత 8ఏళ్లుగా ప్రభుత్వం నుంచి బోనాల చెక్కులను పొందుతున్నట్లు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి ఆరోపించారు.
ఈమేరకు గురువారం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సైదులు ఇక్కడికి వచ్చి ఈ వ్యవహారంపై విచారణ జరిపారన్నారు. ఈసందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..డివిజన్ లోని మరికొన్ని చోట్ల ఒకే టెంపుల్ పై రెండేసి చెక్కులను తీసుకున్నారన్నారు.పద్మారావునగర్ లో ఒకే టెంపుల్ నుంచి ఒకే వ్యక్తి ప్రతి ఏటా రెండేసి చెక్కులను తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేఆర్ నగర్ లో ఓ ఆలయం పేర ఒకే టెంపుల్ నుంచి ఓ వ్యక్తి ప్రతి ఏటా రెండేసి చెక్కులను తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇలా కొన్ని టెంపుల్ లకు కోడ్ లేకుండానే అధికారులు ఆయా వ్యక్తులకు రెండేసి చెక్కులను ఇస్తున్నారని తెలిపారు. డివిజన్ లో మొత్తం 26 ఆలయాలకు సంబందించిన లక్షలాది రూపాలయల బోనాల జాతర చెక్కుల గోల్మాల్ జరిగిందని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి,చెక్కులను స్వాహా చేసిన వారినుంచి నిధులను రికవరీ చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. సిటీలో అన్ని చోట్ల బోనాల జాతర చెక్కుల వ్యవహారాలపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి పెట్టి, అక్రమాలను వెలికి తీయాలని ఆయన కోరారు.
గత ప్రభుత్వ హాయంలో బోనాల జాతర చెక్కుల పంపిణీలో చాలా అవకతవకలు జరిగాయన్నారు. దేవుడి సొమ్మును స్వాహా చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో బ్లాక్ మహిళా ప్రెసిడెంట్ నస్రీన్ బేగం,నాయకులు భీమ్రావు,సాయి సందీప్,చంద్రశేఖర్,కాంతారావు,కృష్ణ,శిల్ప,భాగ్యమ్మ,దీపి,ఉమా,అయూబ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
