కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:
అక్కడికక్కడే ఒకరు మృతి * మరొకరికి తీవ్ర గాయాలు
కొత్తపల్లి గ్రామం సాయి నగర్ వాసులుగా గుర్తింపు
భీమదేవరపల్లి ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి జూలై 1 :
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న బైక్, కారును ఢీకొట్టిన ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కొత్తపల్లి గ్రామంలోని సాయినగర్ కాలనీకి చెందిన శ్రీహరి మరియు వెంకటేష్‌లుగా గుర్తించబడ్డారు. సమాచారం మేరకు, ఆళ్ల శ్రీహరి అక్కడికక్కడే మృతి చెందగా, మంచిల్ల వెంకటేష్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ముల్కనూర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. బాధితుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
