ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు
భీమదేవరపల్లి మండలంలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం
వైద్యులు… కనిపించే దేవుళ్ళు
భీమదేవరపల్లి మండలంలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం
భీమదేవరపల్లి, జూలై 1(ప్రజామంటలు) :
వైద్యులు కనిపించే దేవుళ్ళు అని వినిపించే మాట, ప్రస్తుత కాలంలో మరింత మరింత స్పష్టంగా రుజువవుతోంది. రోగుల ప్రాణాలను కాపాడుతూ తన సేవలతో విశేష గుర్తింపు పొందుతున్న వైద్యులను గౌరవించేందుకు ప్రతి ఏడాది జూలై 1న డాక్టర్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మండల కెమిస్ట్ అండ్ డ్రగ్జిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి, సుధాకర్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ సుధాకర్, లిటిల్ ఏంజెల్ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ స్వామిరావును శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.
ఈ సత్కార కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ బొజ్జపూరి మురళి (శ్రీ మణికంఠ మెడికల్), మామిడాల రవీందర్ (రవీంద్ర మెడికల్), సుద్దాల జవహార్ (నవతా మెడికల్), రాజు (సుశ్రుత మెడికల్), యాదగిరి (కార్తికేయ మెడికల్), తౌటం రాజేష్ (మా సాయి దత్త మెడికల్), ఉడుత శ్రీనాథ్ (స్వస్తిక్ జనరిక్ ఫార్మసీ) తదితరులు పాల్గొన్నారు.
వైద్యుల సేవలు అద్భుతమైనవని ప్రశంసిస్తూ, వారి సేవలను స్మరించుకునే విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమం హర్షాతిరేకాలను సంతరించుకుంది
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
