సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు
సిఐటియూ జెండాను ఆవిష్కరించిన
మండల సిఐటియు అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య
గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని ట్రాలీఆటోలు పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎర్ర జెండాలతో ర్యాలీగా వచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సి.ఐ.టి.యూ. యూనియన్ అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మేడే వేడుకలను చేసుకోవడం జరుగుతుందని అన్నారు .ప్రపంచ కార్మికులను ఏకం చేసి హక్కులను సాధించుటకు, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. అమెరికాలోని చికాగో పట్టణంలో కార్మికులు 18 గంటలు పని దినాన్ని వ్యతిరేకిస్తూ, 8 గంటల పని దినాలు కావాలని జరిపిన ప్రదర్శన పై అమెరికా పోలీసులు జరిపిన కాల్పుల్లో 8 మంది కార్మికులు బలయ్యారని గుర్తు చేశారు.
అమెరికాలోని చికాగో నగరంలో ప్రాణాలు అర్పించిన నాయకులను స్మరించుకున్నారు.వారి పోరాట బాటలో మరింత పోరాటాలకు సిద్ధంగా ఉండాలని మండల గ్రామ పంచాయతీ కార్మికులకు అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సిఐటియు అధ్యక్షులు జంగిలి ఎల్లయ్య ఉపాధ్యక్షులు తడగొండ సురేష్ , చెవుల మద్ది రాజయ్య, సామల వీరాస్వామి, శాతల మహేష్ , సిపెళ్లి సాయి ఆశ వర్కర్లు ఆటో కార్మికులు అమాలి కార్మి కులు వివిధ గ్రామాల పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
