వరల్డ్ ఎక్స్‌పో 2025 (World Expo 2025) వేదికగా రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

On
వరల్డ్ ఎక్స్‌పో 2025 (World Expo 2025) వేదికగా రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

వరల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుంచి మొట్టమొదటిగా పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ
హైదరాబాద్‌లో 30,000 ఎకరాల విస్తీర్ణంలో 'ఫ్యూచర్ సిటీ' నిర్మాణం
తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు - మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్ ఏప్రిల్ 21:

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జపాన్‌లో జరిగిన వరల్డ్ ఎక్స్‌పో 2025 (World Expo 2025) వేదికగా రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఎక్స్‌పో 2025 (Expo 2025 Osaka)లో ముఖ్యమంత్రి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భాగస్వామిగా పాల్గొంది.

వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వారితో సుదీర్ఘంగా చర్చించారు.

 ఈ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మాట్లాడుతూ, వరల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుంచి మొట్టమొదటిగా పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది గర్వకారణమని తెలిపారు. తెలంగాణ – జపాన్ మధ్య ఉన్న చారిత్రక స్నేహ బంధాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తు ప్రణాళికలను రూపుదిద్దుకునే దిశగా కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణకు పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. “హైదరాబాద్‌కు రండి, మీ ఉత్పత్తులు ఇక్కడ తయారు చేయండి. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ దేశాలకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి” అంటూ జపాన్ కంపెనీలను ఆహ్వానించారు.

IMG-20250421-WA0023

తెలంగాణ – జపాన్ మధ్య ఉన్న మంచి సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయానికి ఇది నాంది కావచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఒసాకా, అంతర్జాతీయంగా మిగతా భాగస్వాములతో కలసి అద్భుత భవిష్యత్తును నిర్మిద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో 30,000 ఎకరాల విస్తీర్ణంలో 'ఫ్యూచర్ సిటీ' నిర్మాణం

 హైదరాబాద్‌లో 30,000 ఎకరాల విస్తీర్ణంలో 'ఫ్యూచర్ సిటీ' నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ఇది ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన మరుబెని కార్పొరేషన్‌తో కలిసి ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్ (RRR), రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే అభివృద్ధికి జపాన్ నగరాలైన టోక్యో, ఒసాకాల శ్రేష్ఠమైన అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు - మంత్రి శ్రీధర్ బాబు 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని గుర్తుచేస్తూ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నదని వివరించారు.

 పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు మాట్లాడుతూ, నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ'ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.

Tags

More News...

Local News 

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల  ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల  ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం                     సిరిసిల్ల . రాజేంద్ర శర్మ    జగిత్యాల మే 1 ( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా  తీసుకువచ్చిన భూ భారతి- 2025 చట్టంపై పోలీస్ అధికారులకు అవగాహన పెంచే ఉద్దేశంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో జగిత్యాల  ఆర్డి ఓ చే  ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి  అశోక్ కుమార్...
Read More...
Local News 

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి.. సికింద్రాబాద్, మే01 (ప్రజా మంటలు): ఉద్యోగులు తమ ఉద్యోగ పదవీకాలంలో నిబద్దతతో చేసిన విధులు తమకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మాద్ నయీమ్ ఖాన్  రిటైర్మెంట్ వీడ్కోలు సమావేశంలో గురువారం జరిగింది. ఈసందర్బంగా పలువురు మహ్మాద్ నయీమ్ ఖాన్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన శేషజీవితం...
Read More...
Local News 

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక సికింద్రాబాద్  మే 01 (ప్రజా మంటలు):  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని గంభీర్ పూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన ఎన్నికలు నిర్వహించారు.ఈ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మ్యాదరి నర్సింలు,క్యాషియర్ గా బైండ్ల బాలరాజు ను,కార్యదర్శిగా నిరటి నర్సింలు,గౌరవ సభ్యులు జక్కుల రాజు చిన్న,...
Read More...
Local News 

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సికింద్రాబాద్,  మే 01 (ప్రజా మంటలు): సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి కోరారు. గురువారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో కి రూ....
Read More...
Local News 

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్ *సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ *సన్న బియ్యంతో వండిన అన్నం తిన్న సంతోష్ సికింద్రాబాద్, మే01 ( ప్రజామంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గములో  గురువారం నిరుపేద కుటుంబాలకు...
Read More...
Local News 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్ 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్  సికింద్రాబాద్, మే 01 (ప్రజా మంటలు): వేసవి సెలవులు నేపథ్యంలో గణిత నిపుణులు రాజాగా పేరుగాంచిన రాజా నర్సింహారావు సిటీలోని ఆశ్రయ  హోమ్స్ ఫర్ గర్ల్స్ రెయిన్ బో హోమ్స్ వేసవి శిబిరంలో మాథ్స్ వర్క్ షాప్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ కు గణిత శాస్త్రంలో   మెళకువలు ,టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు,...
Read More...
Local News 

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): నిన్న ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మల్లన్న పేట పాఠశాల విద్యార్థులు 28 మంది విద్యార్థులకు గాను 28 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణతను సాధించారు.ఇందులో 8 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు.గొల్లపల్లి మండలంలో, ప్రభుత్వ & స్థానిక...
Read More...
Local News 

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు సిఐటియూ జెండాను  ఆవిష్కరించిన మండల సిఐటియు  అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని ట్రాలీఆటోలు పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎర్ర జెండాలతో ర్యాలీగా వచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సి.ఐ.టి.యూ. యూనియన్ అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య జెండా ఆవిష్కరించారు....
Read More...
Local News 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మెట్పల్లి మే 1( ప్రజా మంటలు)జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల మరియు వేంపేట , మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం...
Read More...
Local News 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్. 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి.  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1(ప్రజా మంటలు) విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు బాల బాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిభిరం లో మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు...
Read More...
Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...