ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం చైర్మన్ గా డా. బి ఎం .వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా మంద. భీమ రెడ్డి
హైదరాబాద్ ఏప్రిల్ 10 (ప్రజా మంటలు)
సంవత్సరం లోగా ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం.
కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు... గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జి.ఓ. విడుదల చేశారు. రెండేళ్ల కాలపరిమితి గల ఈ కమిటీ చైర్మన్ గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి లను నియమించారు. జిఎడి ప్రోటోకాల్, ఎన్నారై విభాగానికి చెందిన జాయింట్ సెక్రెటరీ స్థాయి ఐఏఎస్ అధికారి కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు.
కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ లను నియమించారు.
గల్ఫ్ వలసలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగిన ప్రవాసీ కార్మిక నాయకులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, డా. లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాస రావు, కొట్టాల సత్యంనారా గౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల లను కమిటీ సభ్యులుగా నియమించారు.
సీఎం హామీ నేపథ్యంలో...
గత సంవత్సరం ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాజ్ దక్కన్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గల్ఫ్ తదితర గమ్యస్థాన దేశాలలోని అల్పాదాయ తెలంగాణ వలస కార్మికులకు ఆయా దేశాలలో లభిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దేశంలోని కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రవాసీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలను కనుగొనడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తుంది.
ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా... సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) రూపకల్పన తో పాటు, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ తదితర దేశాల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
