ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

On
ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

( రామ కిష్టయ్య సంగన భట్లIMG-20250406-WA0017
 9440595494)

రామ కల్యాణోత్సవ వేడుకలు వైభవో పేతంగా, కన్నుల పండువగా జరిగాయి. ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరాన వెలసిన శ్రీరామాలయంలో ఉదయం శ్రీరామ జన్మో త్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకిష్టయ్య శర్మ, బలరామ శర్మ, బాలచంద్రశర్మ, రఘునాథ శర్మ, మోహన్ శర్మ, 

 వామనశర్మ, రామశర్మ, శరచ్చంద్ర శర్మ, ఆశ్రిత్ శర్మ, విలోక్ శర్మ, భరత్ శర్మల ఆధ్వర్యంలో విధివిధాన వేదోక్త సంప్ర దాయ పూజలొనరించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వస్తి పుణ్యాహ వాచనం, వామదేవ శతానంద రుత్విగ్వరణం, కళ్యాణార్థం వివాహ వేదిక ప్రవేశం, శ్రీరామచంద్ర వరునికై కన్యా న్వేషణ, సీతారామ వంశావళి ప్రవరలు, మధుపర్క ప్రాశనం, సముహూర్త, మంగళ సూత్ర ధారణం, అక్ష తారోపణం, వివాహానంతర లఘు పూజ, నైవేద్యం, మహామంత్ర పుష్పం, దేవతాశీర్వచనం తదితర ప్రత్యేక కార్య క్రమాలను నిర్వహించారు. సర్వాలంకార శోభితులై, పుష్ప మాలాలంకృతు లైన శ్రీరామచంద్రునికి, పరమపావని యైన లోకమాత సీతాదేవికి లోకకల్యా కల్యాణార్ధం అభిజిత్ లగ్న శుభ ముహూ ర్తంలో మధ్యాహ్నం మూల విరాట్టులకు జరిపించిన కల్యాణ మహోత్సవానికి వేలాదిమంది భక్తులు హాజరై కన్నులారా గాంచి తరించారు. రామాలయంలో వేదవిదులు మధు శంకర శర్మ, బల్యపెల్లి ప్రసాద్ శర్మ, సంగన భట్ల నర్సయ్య శర్మ, 
పనతుల వెంకట రమణ శర్మ, మధు మహాదేవ్ శర్మ, ఒజ్జల వేంకట రమణ శర్మ, కషోజ్జల రాజేష్ శర్మ, ఇందారపు లక్ష్మీ కాంత్ శర్మ, రాంకిషన్ శర్మ, పెండ్యాల బాలకృష్ణ శర్మ, బొజ్జా ఉమాకాంత్, కొరిడే శంకర్, కాకేరి గోపాల్, 
కాసర్ల వేంకట రమణ శర్మ,  భరత్ శర్మ, ప్రసాద్ శర్మ, పాలేపు దత్తాత్రి, సంగన భట్ల నర్సయ్య, సురేందర్, గొల్లపెల్లి గుండయ్య 
తదితరులు కల్యాణోత్సవాన్ని జరిపించారు.

పట్టు వస్త్రాల సమర్పణ

ధర్మపురి దేవస్థానం పక్షాన ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరముకూడ అందజేయటం జరిగింది. దేవస్థానం ధర్మకర్తల మండలి అద్యక్షులు జక్కు రవీందర్, ధర్మకర్తలు బాదినేని వెంకటేష్,  బొల్లారం పోచయ్య, గుడ్ల రవీందర్,  కొమురెల్లి పవన్ కుమార్,  మందుల మల్లేష్, నేదునూరి శ్రీధర్, రాపర్తి సాయికిరణ్, స్తంభంకాడి గణేష్, సంబెట తిరుపతి, ఒజ్జల సౌజన్య నరేందర్, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు ,   సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ 
 పాల్గొన్నారు.   

లక్ష్మీ నరసింహ కాలనీలో

ధర్మపురి పట్ట ణంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కాల నీలో నిర్మితమైన శ్రీరామాలయంలో  వేద పండితులు కాసర్ల వంశీ కృష్ణ, కషోజ్జల బాలకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ వోడ్నాల తిరుపతి నేతృత్వంలో ఉదయం నుండి వేదోక్త స్మార్త సంప్రదాయరీతిలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామునికి, సీతాదేవికి లోకకల్యాణార్థం జరిపించిన కల్యాణ మహోత్సవానికి వేలాదిమంది భక్తులు హాజరై కన్నులారా చూసి తరించారు. 

దేవస్థానంలో..

ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో సీతారామ, లక్ష్మీ నరసింహ స్వాముల కల్యాణ వేడు కలు  ఒకే వేదికపై ఒకే మహూర్తాన కన్నుల పండువగా జరిగాయి.
 దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్,  ధర్మకర్తల మండలి సభ్యులు ఏదులాపురం మహేందర్, బాదినేని వెంకటేష్, బొల్లారపు పోచయ్య, గుడ్ల రవీందర్, కొమురెల్లి పవన్ కుమార్, మందుల మల్లేష్, నేదునూరి శ్రీధర్, రాపర్తి సాయి కిరణ్, స్తంభంకాడి గణేష్, సంబెట తిరుపతి, ఒజ్జల సౌజన్య నరేందర్ గార్లు వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ,  ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, అర్చకులు నంభి అరుణ్ కుమార్, చక్రపాణి కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్,   అర్చకులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కల్యాణ మూర్తులను వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో, శేషప్ప కళా వేదికపైకి తీసుకొచ్చి, శోడశోపచార సహిత పూజలతో, సాంప్రదాయ బద్దంగా కల్యాణం జరిపించారు. 

 తిమ్మాపూర్ లో

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో రామ జన్మ, కళ్యాణ వేడుకలకలను బ్రహ్మోత్సవాలలో బాగంగా నిర్వహించారు. అర్చకులు నేరెళ్ళ వంశీకృష్ణ, మోహన్,  బొజ్జా రాజ గోపాల్ శర్మ,  కళ్యాణం జరిపించారు. 


 మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయులు నర్సింగ్ రావు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే జైనా, దొంతాపూర్, గండి హన్మాన్ ఆలయాల్లో సీతారామ కళ్యాణ వేడుకలు నిర్వహించారు 

సాయి జన్మ దిన వేడుకలు

ధర్మపురి క్షేత్రస్థ గోదావరీ నదీ తీరస్థ శ్రీసాయి బాలాజీ మందిరంలో  సాయిబాబా జన్మదిన వేడుకలు వైభ వంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక నిర్మాత ఒజ్జల ప్రవీణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో, ట్రస్టు అధ్యక్షుడు గోలి రాంప్రసాద్ నిర్వహణలో, అర్చకులు, స్థానిక వేద పండితులు ఆకర్ష్ శర్మ, అక్షయ్ శర్మలు, ప్రత్యేక పూజలు, జన్మదిన అర్చనలు నిర్వహించారు. మహా క్షీరాభిషేక కార్యక్రమంలో అశేష భక్తజనులు స్వహస్తాలతో, సాయినాథున్ని క్షీరాభిషిక్తుడిని చేసి తరించారు. ఈ సందర్భంగా నివేదనలు సమర్పించారు.

Tags

More News...

Local News 

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం సికింద్రాబాద్, మే 03 (ప్రజామంటలు):శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బౌద్దనగర్ డివిజన్ లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ దారిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కు సంబందించిన సెంట్రింగ్ గాలివానకు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా కుప్పకూలింది. దాంతో అక్కడున్న కరెంట్, వైఫై తదితర తీగలు తెగిపోయాయి. సెంట్రింగ్ కట్టెలు,...
Read More...

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 3 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లో బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు జిల్లా కోర్టును సందర్శన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కోర్టు కు అవసరమైన మౌలిక సదుపాయాలు ,నూతన కోర్టు ,కోర్టు హాల్,నూతన పోస్టుల,అడ్వకేట్...
Read More...
Local News 

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  *అభ్యర్థులు  పరీక్షా కేంద్రాలకు పెన్నులు,పెన్సిళ్లు తీసుకురావొద్దు* *పరీక్షా కేంద్రంలోనే అభ్యర్థులకు పెన్నులు అందజేత*   *ఈ నెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష పై అభ్యర్థులకు  పలు సూచనలు చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.* ఈ నెల 4వ తేదీన(ఆదివారం)నీట్ పరీక్ష...
Read More...
Local News 

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్    - ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి జగిత్యాల ఏప్రిల్ 03:  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు 2019 లో నిర్వహించిన సమ్మె కాలం నాటి అక్రమ కేసులను ఈ ప్రభుత్వం ద్వారా ఎత్తివేయించాలని ప్రముఖ ఉద్యమ కారులు మహంకాళి రాజన్న, చుక్క గంగారెడ్డి లు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు శనివారం విజ్ఞప్తి...
Read More...
Local News 

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు                                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 34 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామచంద్రం ను జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి...
Read More...

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న 

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న  విదేశాల్లో ఉన్న వారిని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం ఆగని ఏజెంట్ల మోసాలు - ఆగిపోయిన కేంద్ర సేవలు టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా హైదరాబాద్ ఏప్రిల్ 02: గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించడం విఫలం అయిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక...
Read More...

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు జగిత్యాల మే 02 (ప్రజా మంటలు) శ్రీ ఆదిశంకరాచార్య శ్రీమాన్ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో జయంతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల చిత్రపటాలకు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పం, నిర్వహించి స్వామి వార్ల జీవిత విశేషాలను...
Read More...
Local News 

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, మే 02  (ప్రజామంటలు): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో  రికగ్నైజ్ గుర్తింపు కలిగిన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కాశపాగా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి కార్మికులకు వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు, అన్యాయం జరిగిన అ సమస్యకు పరిష్కార దిశగా న్యాయబద్ధ పోరాటం చేసి బాధితులకు...
Read More...
Local News 

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ  ప్యాకెట్లు పంపిణీ సికింద్రాబాద్, మే 02 (ప్రజామంటలు): వాసవిక్లబ్ ప్రతినిధి బి.లక్ష్మీ వివేకానంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొండాపూర్ లోని ఆదిత్యా హైట్స్ వద్ద ఉన్న చలివేంద్రంలో వందలాది మందికి మజ్జిగ ను పంపిణీ చేశారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్ మ్యాడం చంద్రశేఖర్, ప్రతినిధులు విద్యా సంకల్స్ గోలి జగదీశ్వర్, ఆదిత్యా...
Read More...
State News  Spiritual  

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు(రామ కిష్టయ్య సంగన భట్ల...        9440595494) "భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర" అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో... భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా...
Read More...
State News 

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్ గొల్లపల్లి మే 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల ఎస్ఐ సిహెచ్ ,సతీష్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రం అందుకున్నారు. పోలీస్ స్టేషన్లో కేసుల పరిష్కారానికి సత్వర న్యాయం చేయడం నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు మండలంలో శాంతిభద్రతలను నిలకడగా ఉండడంతో ప్రశంసిస్తూ...
Read More...
Local News 

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ  

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ   సికింద్రాబాద్, ఏప్రిల్ 02 (ప్రజామంటలు): వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జియాగూడ లోని గోశాలో గోసేవ, గోపూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బి.లక్ష్మీ వివేకానంద్ స్పాన్సర్ చేయగా వాసవి క్లబ్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈసందర్బంగా గోవులకు ఒక ట్రక్కు పచ్చగడ్డి ని గోశాలకు అందచేశారు. గోవులకు పూజలు చేశారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్...
Read More...