శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం
భారీగా తరలివచ్చిన భక్తులు
గొల్లపల్లి ఎప్రిల్ 06 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో శ్రీకళ్యాణ రామచంద్ర ఆలయ ప్రాంగణంలో రాములోరి శ్రీరామ నవమి వేడుకలు ఆలయ ధర్మకర్త అనంతుల భూమయ్య -సువర్ణ అర్చకులు తిరుణారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణలు మధ్య శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు కళ్యాణ రామచంద్రస్వామికి.అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కీర్తిశేషులు ముస్క్ కృష్ణారెడ్డి, సతీమణిలక్మి,-తిరుపతి రెడ్డి -అనిత, కుటుంబ సభ్యులు సమర్పించారు. అన్నదానం నిర్వహించారు.
స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు గ్రామ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీ సీతారాముల కల్యాణం ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగుపై.. మంగళవాయిద్యాలు, వేద పండితుల చేత మంత్రోచ్ఛరణలు, రామ భక్తుల జయజయ ధ్వనాల మధ్య అభిజిత్ లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12.35 గంటలకు సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది రామయ్య పెళ్లిని తిలకించడానికి గ్రామ నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చారు.
ఉదయం కల్యాణ ఘట్టం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.35 గంటలకు కల్యాణ వేద పండితుల మంత్రోచ్ఛరణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే 12.35నిమిషాలకు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాములవారి శిరస్సుపై ఉంచారు. ఇది శుభ ముహూర్తం కాగా జగత్ కల్యాణ శుభ సన్నివేశం ఆవిష్కృతమైంది రామయ్య సీతమ్మ మెడలో మాంగళ్య దారణ చేశారు. అనంతరం తలంబ్రాల వేడుక ఆ తర్వాత బ్రహ్మ బంధనం వేశారు.
దీన్ని బ్రహ్మముడి అని కూడా అంటారు.చతుర్వేదాలతో నూతన దంపతులకు ఆశీర్వచనం పలికారు. సాధారణంగా కల్యాణంలో రెండు సూత్రాలు ఉంటాయి. సీతారామ కల్యాణంలో మాత్రం మూడు సూత్రాలు ఉంటాయి. భక్త రామదాసు ఎంతో వాత్సల్యంతో తయారు చేసిన పతకాన్ని కలిపి మూడు సూత్రాలను సీతమ్మవారికి ధరింపజేశారు. సీతా రాముల కళ్యాణం చూసేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు.
శ్రీరామ నామస్మరణతో హనుమాన్ భక్తులు శ్రీరామ జయ రామ అంటూ ఆలయంలో మారుమోగాయి ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు గ్రామ ప్రముఖులు యువకులు రామ భక్తులు మహిళలు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కృషి చేసిన వారందరికీ పేరుపేరునా ఆలయ ధర్మకర్త అనంతుల భూమయ్య కళ్యాణ రామచంద్రస్వామి ఆశీస్సులు ఎప్పటికీ నీపైన ఉండాలని అన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం
