అధికారులు ఎస్సి, ఎస్టీ వర్గాల ప్రజలకు మానవియ కోణం లో స్పందించి..  వారి అభ్యున్నతి కి కృషి చేయాలి  తెలంగాణ రాష్ట్ర ఎస్ సి,ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

On
అధికారులు ఎస్సి, ఎస్టీ వర్గాల ప్రజలకు మానవియ కోణం లో స్పందించి..  వారి అభ్యున్నతి కి కృషి చేయాలి   తెలంగాణ రాష్ట్ర ఎస్ సి,ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

 

జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు)

కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  శుక్రవారం ఎస్ సి, ఎస్ టి అభివృద్ధి సంక్షేమ పథకాలపై తెలంగాణ రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబు నాయక్, లక్ష్మి నారాయణ లతో కలిసి సమీక్ష నిర్వహించారు

. ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులకు ఐ.డి.ఓ.సి వద్ద అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత సాదరంగా స్వాగతించారు. పోలీసు వారి చే గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలనుఅడిషనల్  కలెక్టర్ వివరించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో  ఎస్సీ  ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తి గా వారికే కేటాయించాలని, నిధులు పక్కదారి పడకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో  రూల్ అఫ్ రిజర్వేషన్ తప్పకుండ పాటించాలని అన్నారు ఎస్సీ ఎస్టీ ల అభ్యున్నతి కి అధికారులు ప్రత్యేక ద్రుష్టి సారించాలని అన్నారు..ఎస్ సి, ఎస్ టి సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్ సి, ఎస్ టి లకి సంబదించిన భూములపై కేస్ లు త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ చట్టం పై అధికారులు ప్రజలకి అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రతినెల చివరి రోజున ఖచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం జరిగేలా చూడాలని, హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఐ ల ద్వారా నిర్వహిస్తున్నారని అలా చేయకుండా తహసీల్దార్, ఎస్ ఐ లు పౌరహక్కుల దినోత్సవం కి హాజరు అయి ప్రజలకి చట్టం పై అవగాహన కల్పించాలని సూచించారు.

ధర్మపురి శాసన సభ్యులు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టాన్ని  అమలు కు కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. గదేపల్లి పరిధిలో ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించారాని, ఆ భూములను పరిరక్షించాలని కోరారు. అనంతరం 
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ విద్యా చట్టాన్ని తూచ తప్పకుండ పాటించాలని కోరారు.

 ప్రయివేట్ విద్యా సంస్థలలో పేదలకు 25 శాతం  సీట్ల ను ఖచ్చితంగా కేటాయించాలని అన్నారు.
అనంతరం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ,సభ్యులను  జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో  ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డివో లు పులి మధు సుధన్ గౌడ్ , జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ , జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ డి.ఏ.సి.పిలు రఘు చందర్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మెట్పల్లి మే 1( ప్రజా మంటలు)జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల మరియు వేంపేట , మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం...
Read More...
Local News 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్. 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి.  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1(ప్రజా మంటలు) విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు బాల బాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిభిరం లో మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు...
Read More...
Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...
Local News 

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): SSC -2025 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థల జ్యోతి, మానస, సూర్య స్కూల్స్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. 589 మార్కులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యా సంస్థగా సిద్ధార్థ విద్యా సంస్థ చరిత్ర సృష్టించింది. 580 మార్కుల పైగా...
Read More...
Local News 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం మరియు జడ్.పి.హెచ్.ఎస్ గోధూర్ పాఠశాలల యందు మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మోడల్ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలో 6 నుండి...
Read More...
Local News 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ హైదరాబాద్ ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు)  మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో జరిగే ధార్మిక కార్యక్రమాలలో భాగంగా బుధవారం స్థానిక ముషీరాబాద్ లో గల భవానీ శంకర దేవాలయం వేదిక గా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 33 మంది వటువులకు శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి తండ్రి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు ఇబ్రహీంపట్నంలో శ్రీకాంత్ రెడ్డి తండ్రి ని పరామర్శించారు త్వరితగతిన ఈ...
Read More...
Local News 

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో అతిపురతన మహదేవుని శివలయం పున ప్రతిష్ట మహోత్సవం లో భాగంగా నుతనం గా ఎర్పాటు చేస్తున్న ద్వజస్థంబ ఎర్పాటు కు గుడ్ల విజయ్ కుమార్- అనుష దంపతులు బుధవారం రుపాయలు 76 వేల  విరాళం...
Read More...
Local News 

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు): ఉపాధ్యాయుల కృషి వల్లే పదవ తరగతి  పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని డీఈవో కె. రాము అన్నారు.జగిత్యాల జిల్లా 98.2 శాతంతో నాలుగవ స్థానంలో నిలిచిన సందర్భంగా  జిల్లా విద్యాధికారి కె.రాముకిఎస్టియు టీ.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు  మచ్చ...
Read More...
Local News 

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా సికింద్రాబాద్, ఏప్రిల్ 30 ( ప్రజామంటలు): భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్టూడెంట్స్ బుధవారం విడుదల అయిన పదవతరగతి వార్షిక ఫలితాల్లో విజయ కేతనం ఎగురవేశారు. రోహిత్ మిశ్రా అనే విద్యార్థి 600 మార్కులకు గాను 556 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. తర్వాత ఆర్ .నిహారిక 600 మార్కులకు గాను 533...
Read More...