సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.
పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.
-పెన్షనర్ల ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం.
జగిత్యాల అక్టోబర్ 21:
పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం ఇంకా జాప్యం చేయక వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ ప్రయోజనాలు అందక కొందరు అనారోగ్యం బారిన పడుతున్నారని, మరి కొందరు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన దీపావళి సమ్మేళనం లో తెలంగాణ పండుగలు -సంప్రదాయాలపై టీ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ప్రసంగించారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో పేద మహిళలు 12 మందికి దీపావళి కానుకలు గా నూతన వస్త్రాలు, దుప్పట్లు జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ చేతుల మీదుగా అందజేసి వారిని సన్మానించారు.
అనంతరం జిల్లా లో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 12 మంది రిటైర్డ్ ఉద్యోగులకు దీపావళి పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమం లో టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సి. హన్మంత్ రెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాతం, ఉపాధ్యక్షులు వెల్ ముల ప్రకాష్ రావు, సత్యనారాయణ,ఎం. డీ. యా కూబ్, జగిత్యాల యూనిట్ అధ్యక్షులు బి. రాజేశ్వర్, కోరుట్ల అధ్యక్షులు పబ్బా శివానందం, మెట్ పల్లి అధ్యక్షులు మురళి, రాయికల్ అధ్యక్షులు వై. వేణు గోపాల్ రావు, మల్యాల అధ్యక్షులు ఎం. డీ.యా కూబ్, కార్యదర్శి వీరారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం
.jpeg)
ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు
.jpeg)
రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు

డాక్టరేట్ పొందిన జిల్లా ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్ సత్యప్రసాద్

చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు
.jpeg)
మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్
.jpg)
రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర
.jpeg)
వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి
