సెక్యులరిజం అంటే ఇదేనా?హిందువుల పండుగలకు వడ్డింపులు...ముస్లింలకు కానుకలా?
బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి.
సికింద్రాబాద్, సెప్టెంబర్ 22 ( ప్రజామంటలు ) :
దసరా పండుగకి ప్రత్యేక బస్సుల పేరిట బస్సు చార్జీలపై 50 శాతం వడ్డించడం సరికాదని ముస్లింలకు హజ్ యాత్రకు క్రైస్తవులకు బేతల్హోమ్ కు రాయితీలు ఇచ్చి హిందువుల పండగలకు ప్రత్యేకం పేరిట దోచుకోవడం మానుకోవాలని, అన్ని మతాలను సమానంగా చూడడం అంటే ఇదేనా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో హిందూ మహిళలు కోటి 30 లక్షల మంది ఉండగ కేవలం 65 లక్షల మంది డ్వాక్రా మహిళలకు మాత్రమే రెండేసి చీరల చొప్పున పంచుతామని ఆర్భాటాలు పలకడం సరికాదని 2023లో ఎన్నికల కోడ్ కు ముందు నిలిపివేసిన బతుకమ్మ చీరలను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని ముస్లింలకు రంజాన్ కు క్రైస్తవులకు కిట్లు పంచారని మరి హిందూ మహిళలు ఏం పాపం చేశారని బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేశారని అన్నారు.ఒకవేళ హిందూ మహిళలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చీరలు మూడేసి చొప్పున పంచి పెట్టాలని డిమాండ్ చేశారు.
అంతేకాక ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీం కింద ఒంటరి మహిళకు 50,000 రేవంతన్నాక సహారా మిస్మిన్ కేలియే కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు గ్రాంటు మరియు మోపెడును ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటని హిందూ మహిళలకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని హిందూ మహిళలు మహిళలు కారా అని నిలదీశారు. 2023 ఎన్నికల కంటే ముందు తెలంగాణ మహిళలకు 500 కే సిలిండర్ తులం బంగారం ప్రతి మహిళకు 2500 నగదు 4 వేలు ఆసరా పింఛన్లు మహిళలకు స్కూటీలు పంపిణీ రైతు భరోసా 15000 రెండు లక్షల రుణమాఫీ అంబెడ్కర్ అభయహస్తం కింద దళితులకు 12 లక్షలు రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలు అమలు చేస్తామని చేయలేదని అవన్నీ పూర్తయ్యాకనే కొత్త పథకాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. త్వరలో రానున్న మునిసిపల్,స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లులు కురిపిస్తున్నారని ఇలాంటి మోసపూరిత ప్రకటనల ద్వారా పథకాల ద్వారా తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
