సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ
"లొంగుబాట్లు విప్లవాన్ని ఆపలేవు; అంతిమ విజయం ప్రజలదే"
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పత్రికా ప్రకటన
హైదరాబాద్, అక్టోబర్ 16 (ప్రజా మంటలు):
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, అలాగే ఉత్తర సబ్‌జోనల్ బ్యూరో ఇంచార్జ్ సతీష్ తదితరులు శత్రువుకు లొంగిపోయారని, వీరిని విప్లవ ద్రోహులు, పార్టీ విచ్ఛిన్నకులు, విప్లవ ప్రతిఘాతకులుగా అభివర్ణిస్తూ పార్టీ నుండి బహిష్కరించామని కమిటీ ప్రకటించింది. కేంద్రకమిటీ సభ్యుడు అభయ్ పేర విడుదలైన లేఖలో వీరిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో 61 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడం, 50 తుపాకులు అప్పగించడం “విప్లవ ద్రోహం”గా కేంద్ర కమిటీ అభివర్ణించింది. పార్టీ ప్రతినిధి అభయ్ సంతకం చేసిన పత్రికా ప్రకటనలో, సోను–సతీష్‌లు "ప్రాణభీతి, అవకాశవాదం, మితవాద వైఖరితో విప్లవ తత్వాన్ని విడిచిపోయారని" ఆరోపించారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటనలో, "సోను, సతీష్ ల ముఠా ప్రజల వద్దకు వచ్చినా విప్లవ ప్రజలు వారిని తిరస్కరించాలి" అని పిలుపునిచ్చింది.
అదే సమయంలో, లొంగిపోయిన వారిలో నిజాయితీ గలవారు తిరిగి ప్రజాపక్షానికి వస్తే హాని ఉండదని హామీ ఇచ్చింది.
విప్లవోద్యమం తాత్కాలిక వెనకంజలో ఉన్నప్పటికీ అది శాశ్వత ఓటమి కాదని, పార్టీ, పీ.ఎల్.జీ.ఏ., ప్రజా ఉద్యమాలను పునర్నిర్మించి పోరాటాన్ని కొనసాగిస్తామని కమిటీ హామీ ఇచ్చింది."లొంగుబాట్లు విప్లవాన్ని ఆపలేవు; అంతిమ విజయం ప్రజలదే" అని ప్రకటనలో పేర్కొంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
