దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి
- స్కై ఫౌండేషన్ అధినేత డాక్టర్.వై,సంజీవ కుమార్,
9393613555,9493613555
సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజా మంటలు):
కోట్ల కాంతులతో విరాజిల్లే పండగ దీపావళి, చిన్న పెద్ద అందరూ కేరింతలు కొడుతూ సరదాగా జరుపుకొనే సంబరాల పండుగ దీపావళి, ఈ దీపావళి రోజున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే మరింత ముచ్చటగా, మురిపెంగా, సంబరంగా ఆత్మీయుల నడుమ జీవితకాల మాధుర్యంగా మిగిలిపోతుంది. దీపావళి టపాసులసరంజామా, కాల్చేందుకు, పేల్చేందుకు అందరూ సిద్దమే, మరి జాగ్రత్తలు పాటించడం కూడా ముఖ్యమే, చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలనుచి కాపాడుతాయి.
ప్రమాదం ఎలా అయినా రావొచ్చు, అన్నిటికి సిద్ధంగా ఉండే సంబరాలు చేసుకోవాలి, టపాసులు కాల్చే తప్పుడు ఏదైనా పొరపాటున ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్ళు పక్కన ఉంచుకోండి, టపాసులు కాల్చేవరకే మీ సంబరం, తర్వాత ఆ నిప్పురవ్వలు ఎటు వెళ్తాయి అనేది టపాసుల ఇష్టంతో ఉంటుంది, అలంటి నిప్పు రవ్వలు ఒంటిపైని దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్ దుస్తులనే (పాలిస్టర్ కాకుండా) ధరించండి, పొరపాటున మీరు ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపి చెందే అవకాశం ఉంటుంది, వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదా రగ్గులను కప్పుకోవడం ద్వారా మంటలను, అగ్నికీలలలను నియత్రించవచ్చు, కప్పడం వల్ల నిప్పుకు ఆక్సిజన్ అందక పైకి వ్యాపించదు. మీరు ఉండే ప్రాంతంలో, మీరు టపాసులు కాల్చే ప్రాంతంలో టపాసులు కాల్చే సమయానికి ఇంటి పక్కన ఉన్న ఏ గుడిసె పైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్ సర్వీసెస్‌కు ఫోను చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్ నెంబరు జ్ఞాపకం పెట్టుకోవడం మర్చిపోవద్దు,
నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నాల్, దూది, అయోడిన్, టించర్, డెట్టాల్ తదితరాలతో కూడిన ప్రధమ చికిత్సను చేయాండి, ముందుగా ప్రాధమిక వైద్యం చేసిన
తరువాత కొంత ఉపశమనం పొందినప్పటికీ తప్పక వైద్యుని వద్దకు వెళ్ళి పూర్తి చికిత్స చేయించుకోవడం చాల అవసరం, అజాగ్రత్త చేస్తే ఎప్పుడైనా జరిగిన ప్రమాదం ఇతర వ్యాదులపైనా ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు పెద్దవారు టపాసులు కాలచకుండా చిన్నారులు ఎలా కలుస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే వాటిమీద శ్రద్ద ఉంచితే అటు పిల్లల ఆనందాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు, వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద శబ్దాలు చేసే టపాసులు ఎన్నో రకాలు ఉంటాయి,
వాటిని కాల్చేటప్పుడు, లేదా పక్క ఇంట్లో వాళ్ళు, విధుల్లో వాళ్ళు టపాసులను కాల్చే సమయంలో మాత్రం ఇంట్లో ఉండే చిన్నారులు, పసి బిడ్డలా చెవులలో దూదిని ఉంచండి, చిన్నారులకు కర్ణభేరి చాల ముఖ్యమైనది, సున్నితమైనది, చిన్న జాగ్రత్తలు, పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు, పెద్ద శబ్దాలు, లేదా సీరియల్ గా సబాడాలు వచ్చే వాటికి దూరంగా లేదా, ఖాళీ స్థలంలో కాల్చడం అందరికి శ్రేయస్కరముగా ఉంటుంది, రోడ్లమీద వాహనాలు అటు ఇటు వెళ్తుంటాయి, ప్రజలు నడుస్తూ వెళ్తుంటారు వారికి ఇబ్బంది కలిగించేలా ఎట్టి పరిస్థితులలో టపాసులను పేల్చవద్దు, పిలల్లు మారం చేస్తున్నారని, ఏడుస్తున్నారని వారి చేతులకు రాకెట్, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వొద్దు, చిన్నారులు కాల్చే టపాసులను మాత్రమే వాళ్ళతో కల్పించాలి, టపాసులలో ఎన్నో రకాలు అందులో భూ చక్రాలు ఒక భాగం, ఇవి కాల్చేటప్పుడు కచ్చితంగా పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు. ఆ సమయంలో చిన్నారులు, పసిబిడ్డలు కాల్చే ప్రాంతంలో నేలపైన ఉంచకండి.
టపాసులు కాల్చేటప్పుడు చాల మంది కొవ్వొత్తులను, అగరు వత్తులను ఉంచుతారు, అవి పెనుప్రమాదాలను సృష్టిస్తుంది, వెలిగే క్రొవ్వొత్తి, లేదా అంటించిన అగర్బత్తి టపాసులమీద పడిపోతే విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి.
ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాలపై కవర్లు వేసి ఉంచండి. పండుగ సమయంలో మీ వాహనాలకు దూరంగా టపాసులను కాల్చండి, ఎదో గొప్పగా ఉంటుంది అని, అందరిముందు గొప్పతనం కోసం ఎక్కువగా టపాసులను కొనుక్కొని దుబారా చేయకండి, అప్పులపాలు అవ్వకండి, ఇంకా ముఖ్యంగా వాయుకాలుష్యానికి పెంచకండి, ఎక్కువ ధ్వని టపాసుల వలన శబ్ద కాలుష్యం కూడా ఉంటుంది, తక్కువ ధ్వనితో ఉన్న టపాసులు పేల్చడం, కాల్చడం, అందరికి మంచిది, దీపావళి అంటే వెలుగువెదజల్లేది, చిన్న టపాసు కాల్చిన పండుగనే అనే విషయాన్ని గుర్తించండి, టపాసులకన్నా ఇంటి చుట్టూ నూనె దీపాలు వెలిగిస్తే రాత్రి మొత్తం దీపావళే. మీ జాగ్రత్తలే మీ నిజమైన దీపావళి...
.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
