కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా?
పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలవనున్న సురేఖ - మంత్రుల మధ్య వివాదం బిసి -రెడ్లు గా మార్చుతున్నారా?
మంత్రి కొండ సురేఖ చుట్టూ రాజకీయ కలకలం — OSD తొలగింపు, అరెస్ట్ వివాదం, మంత్రివర్గ భవిష్యత్తు ప్రశ్నార్థకం
హైదరాబాద్ అక్టోబర్ 16:
హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో మంత్రి కొండ సురేఖ చుట్టూ వివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా ఆమె కార్యాలయానికి చెందిన OSD (అఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ను ప్రభుత్వం తొలగించడమే కాక, ఆయనపై అరెస్ట్ చర్యలు చేపట్టే ప్రయత్నం చేయడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ పరిణామాలు సురేఖను మంత్రివర్గం నుండి తప్పించే యోచనలో ప్రభుత్వం ఉందన్న ఊహాగానాలకు తావు కల్పించాయి.
ఈనేపథ్యంలో,MLA క్వార్టర్స్‌లో మీనాక్షి నటరాజన్ ను కలవడానికి మంత్రి కొండా సురేఖ,సెక్యూరిటీ లేకుండా వ్యక్తిగత వాహనంలో..ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి బయల్దేరి వెళ్ళారు.
సమాచారం ప్రకారం, సురేఖ OSD ఆఫీస్ వ్యవహారాల్లో అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగ ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో, మంత్రి సురేఖ మరియు సహ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఈ నిర్ణయాలకు కారణమని భావిస్తున్నారు. ఇద్దరి మధ్య జిల్లాలో పార్టీ బలపరీక్ష, నియోజకవర్గ స్థాయిలో ఆధిపత్య పోరు నెలకొన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, సురేఖను క్రమశిక్షణా ఉల్లంఘన, అంతర్గత విభేదాలపై మంత్రివర్గం నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి. పార్టీ ఉన్నత నేతలు ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తుండగా, సురేఖ అనుచరులు మాత్రం “ఇది రాజకీయ వేధింపు” అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉండగా, వరంగల్ లోని మంత్రి ఇంటి ముందు ఉండే పోలీస్ ఔట్ పోస్ట్ కూడా తొలగించారని తెలుస్తుంది.ఇదంతా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కనుసన్నల్లో, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచనల మేరకే, సురేఖపై వ్యతిరేక ప్రచారం జరుగుతుందని, ఇదంతా బిసి, రెడ్ల మధ్య జాతుల పోరుగా ఒక వర్గం ప్రచారం చేస్తుంది.
సమాచారం ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశముంది. తుది నిర్ణయం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడి చర్చకు దారితీస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...

తహసిల్దార్ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

గొల్లపల్లిలో పోషణ మాసం కార్యక్రమం

అనవసరంగా మా పేర్లు లాగుతున్నారు - మాకు సంబంధం లేదు - మంత్రులు పొంగులేటి - ఉత్తమ్ కుమార్
-overlay.jpg-overlay.jpg.jpg)
ఈనెల 18న బీసీ బందుకు అన్ని వర్గాలు సహకరించాలి బీసీ జేఏసీ

కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా?
-overlay.jpg.jpg)
బీహార్ లో కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ
