చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
మెట్టుపల్లి అక్టోబర్ 16 (ప్రజామంటలు దగ్గుల అశోక్):
చెక్ బౌన్స్ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన గంటా రామ్మోహన్ కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ మెట్ పల్లి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నారం అరుణ్ కుమార్ తీర్పు వెలువరించారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడటం గమనార్హం.
ఫిర్యాదుదారు తరపు న్యాయవాది పసునూరి శ్రీనివాస్ కథనం ప్రకారం, మెట్ పల్లి పట్టణానికి చెందిన గంటా రామ్మోహన్ తన స్నేహితుడు అయిన గుంటుక ప్రసాద్ దగ్గర 2019 లో నాలుగు లక్షల ఎనబై ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. సొమ్ముకు సంబంధించి ఫిర్యాదుదారు ప్రసాద్ కు గ్యారంటీగా ఎస్బిఐ చెక్కు నెంబర్ 295755 జారీ చేశారు.
కాగా అట్టి చెక్కు తేది 03-04-2019 రోజున బ్యాంకులో డబ్బులు లేక బౌన్స్ కావడంతో బాధితుడు మెట్ పల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గుంటుక ప్రసాద్ రామ్మోహన్ పై ప్రయివేట్ ఫిర్యాదును దాఖలు చేయాగ, మెట్ పల్లి కోర్టు గంటా రామ్మోహన్ కు సమన్లు జారీ చేసింది.
అనేక విచారణల అనంతరం గంటా రామ్మోహన్ పై నేరం రుజువు కావడంతో బాధితుడికి నెల రోజుల లోపు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని, లేనిచో 6 నెలల జైలు శిక్ష అనుభవించాలని బుధవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
