స్కందగిరిలో ఈనెల 8 నుంచి తెలంగాణ వేద విద్వాన మహాసభలు
శ్రీజనార్థనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు
హజరు కానున్న రాష్ర్ట గవర్నర్, మంత్రులు సురేఖ, శ్రీధర్ బాబులు
సికింద్రాబాద్, అక్టోబర్ 05 (ప్రజామంటలు) :
శ్రీ జనార్ధన ఆనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకల సందర్బంగా 25వ శ్రీ తెలంగాణ వేద విద్వాన మహాసభలు ఈనెల 8 నుంచి 12వ తారీకు వరకు స్కందగిరి శ్రీ సుబ్రమణ్య స్వామి స్వామి ఆలయ ఆవరణలో జరుగును. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం స్కందగిరి ఆలయ ఆవరణలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్వాహకులు వెల్లడించారు. శ్రీ జనార్ధన ఆనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ తూములూరి సాయినాధ శర్మ, ప్రధాన కార్యదర్శి బ్రహ్మానంద శర్మ లు మాట్లాడుతూ...ఈ రజతోత్సవ వేడుకలకు వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు సనాతన ధర్మకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సనాతన ధర్మాన్ని కాపాడటం, వేదవ్యాప్తికి ట్రస్ట్ ద్వారా దాదాపు 50 వేద పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 9న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఈనెల 10న ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ,ఈ నెల11న మంత్రి శ్రీధర్ బాబు,12న బిజెపి ప్రెసిడెంట్ రామచంద్రరావు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరవుతారని వారు వెల్లడించారు. ఈసందర్బంగా మహాసభలకు సంబందించిన పోస్టర్లను ప్రతినిధులు ఆవిష్కరించారు. ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ జేఎన్ రావు, ట్రస్ట్ మెంబర్ జయశంకర్ లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్

🗞️ *బ్రేకింగ్ న్యూస్* *దేశం మరియు రాష్ట్రాల నుండి సాయంత్రం ముఖ్య వార్తలు
