దుర్గా ఉత్సవాలు, బతుకమ్మ, పండుగను ప్రశాంతంగా జరిగే విధంగా భద్రత పరమైన ఏర్పాట్లు చేయాలి._ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు)
పట్టణ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా జగిత్యాల పట్టణ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు అన్ని పూర్తి చెయ్యాలి అని సూచించారు. బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి అని నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు.పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ, వారు ప్రస్తుతం వినియోగిస్తున్న నూతన పద్ధతులపై వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని సూచించారు.
దుర్గా నవరాత్రి ఉత్సవాలు, దసరా వేడుకలు శాంతియుతంగా, ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని అన్నారు. మహిళలు బతుకమ్మ ఆడేటువంటి ప్రాంతాల్లో, దుర్గామాత అమ్మవారు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, పెట్రోలింగ్, విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలని అన్నారు.
ఎస్పీ వెంట సీ.ఐ కరుణాకర్ ఎస్.ఐ లు కుమారస్వామి ,మల్లేష్ ,రవి కిరణ్ ,సుప్రియ, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య
