కృష్ణానగర్–కవాడిగూడ రోడ్‌లో పూర్తి అద్వాన్నంగా డ్రైనేజీ వ్యవస్థ
డ్రైనేజీ మురుగు నీటికి తోడు వర్షపు నీరు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 23 (ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ కృష్ణానగర్ కాలనీ ఎల్ఐసి బిల్డింగ్ నుంచి కవాడిగూడ రోడ్ వరకు డ్రైనేజీ లైన్లు దెబ్బతినడంతో మురుగు నీరు వీధుల్లోకి వచ్చి పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మసీదు వద్ద వెదురు బొంగుల దుకాణాల వద్ద ఎక్కువగా నీరు చేరి వ్యాపారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
ఈ సమస్యపై గతంలో చాలా సార్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తే ఈ సమస్య తమ పరిధిలోకి రాదని అటు జలమండలి, ఇటు జీహెచ్ఎమ్సీ అధికారులు చెబుతున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చివరికి స్థానికులు జలమండలి జీఎం వినోద్‌కుమార్ , ఏజీఎం ఆశిష్, డివిజనల్ ఇంజనీర్ సన్నీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు మంగళవారం క్షేత్రపర్యటనకు వచ్చి, సమస్యను పరిశీలించారు. చాలా కాలంగా ఈ మురుగు నీటి సమస్యతో తాము నరకం చూస్తున్నమని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను కోరారు. జలమండలి, జీహెచ్ఎమ్సీ అధికారులు సమన్వయంతో పనిచేసి, తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక నాయకులు శీలం శివలింగం,షాయద్,ఎల్లేశ్,శ్రీనివాస్,దుర్గేశ్ తదితరులు కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
