మహబూబాబాద్ ప్రభుత్వ. ఆస్పత్రి సూపరింటెండెంట్పై దాడి అమానుషం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 22 ( ప్రజామంటలు):
మహబూబాబాద్ సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ పై జరిగిన సామూహిక దాడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ ఆసుపత్రి యూనిట్ తీవ్రంగా ఖండించింది.ఈ దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీజీజీడీఏ గాంధీ యూనిట్ ప్రెసిడెంట్ డా.భూపేందర్ సింగ్ రాథోడ్ డిమాండ్ చేశారు.
వైద్యులు దేవుళ్ళు కాదని, ప్రతి రోగి ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులు ఎల్లప్పుడు తమ వంతు కృషి చేస్తారన్నారు. ఏ వైద్యుడు కూడ ఉద్దేశ్యపూర్వకంగా రోగికి హాని చేయడని అన్నారు. వైద్యులపై ఇలాంటి హింసాత్మక చర్యలు సమాజానికి హానికరమని డాక్టర్ రాథోడ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ నిష్పాక్షపాతంగా విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం వైద్యులకు భరోసా ఇవ్వాలని కోరారు. ఈసమావేశంలో టీజీజీడీఏ గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ భూపేందర్ రాథోడ్, సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్బయ్య , కోశాధికారి డాక్టర్ రవి , రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళి, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ వెంకట మణి, డాక్టర్ సుబోధ్, డాక్టర్ రాజేష్, డాక్టర్ నాజిమ్, డాక్టర్ మురళీ కృష్ణ, డాక్టర్ నవీన్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!

గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు

బీసీల బంద్ కు.మద్దతు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి
