తొమ్మిది వారాలు సాక పోయండి. - బిడ్లలను కడుపులో పెట్టి చూసుకుంటా...
నరదృష్టి బాగా ఉంది..వానలు బాగా పడతాయి..
- కట్టమైసమ్మ నల్లపోచమ్మ ఆలయంలో రంగం
సికింద్రాబాద్, జూలై 21 (ప్రజామంటలు) :
తొమ్మిది వారాల పాటు సంతృప్తిగా సాక పొస్తే ఎటువంటి కష్టాలు లేకుండా బిడ్డలను కడుపులో పెట్టి చూసుకుంటానని... చిలకలగూడ రంగం కార్యక్రమంలో రంగం(భవిష్యవాణి) లో అమ్మవారు వినిపించారు. సికింద్రాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ నల్లపోచమ్మ బోనాల జాతర సందర్భంగా సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో పాతబస్తీకి చెందిన మాతంగి లక్ష్మమ్మ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి లో భక్తులు అడిగిన ప్రశ్శలకు జవాబులిచ్చింది.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిపిస్తానని, నరదృష్టి ఎక్కువగా ఉందని, ఈ ఏడాది వైభవంగా జరిపిన బోనాలతో సంతృప్తి చెందానని తెలిపింది. మహమ్మారి వ్యాధులు వ్యాపించకుండా నేను అడ్డు పడుతున్నానని, నన్ను అశ్రద్ధ చేస్తే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించింది. కట్టమైసమ్మ ఆలయాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయాలని సూచించింది. సికింద్రాబాద్కాంగ్రెస్ఇంఛార్జీ ఆదం సంతోష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేందర్‌గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గుంటి కృష్ణ, ప్రధాన అర్చకులు తిరుమాలాచార్యులు, ఆలయ హక్కుదారులు, భక్తులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
బోనాల జారత రెండో రోజు ఫలహారబండ్ల ఊరేగింపు
ఆషాడ మాస బోనాల జాతర నేపద్యంలో సోమవారం చిలకలగూడ, మారేడ్ పల్లిలో ఫలహార బండ్ల ఊరేగింపు, అమ్మవార్లకు తొట్టెల సమర్పణ, రంగం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ చిలకలగూడ లోని చారిత్రాత్మకమైన శ్రీకట్టమైసమ్మ నల్లపోచమ్మ ఆలయంలో బోనాల జాతర రెండోరోజు సోమవారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది అమ్మవార్లను దర్శించుకొని, తమ మొక్కులను చెల్లించుకున్నారు. సాయంత్రం ఆలయంలో రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరిగింది.
ఆలయ ఆవరనలో రంగు, రంగుల ఎల్ఈడీ లైట్ల వెలుగుల జిగేల్ తో ఆలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలిగాయి. వివిద వాయిద్యాలతో పలు చోట్ల నుంచి ఫలహార బండ్ల ఊరేగింపు సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. పోతరాజులు,విచిత్ర వేషాదారులతో ఆద్యంతం ఊరేగింపు హుషారుగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా చిలకలగూడ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్వర్గీయ దాశరథి కృష్ణమాచారి 101 వ జయంతి సందర్భంగా తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన కవితాబివంధనాలు.

తొమ్మిది వారాలు సాక పోయండి. - బిడ్లలను కడుపులో పెట్టి చూసుకుంటా...

చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలు - పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం

ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన ఎండోమెంట్ కమిషనర్

ప్రధాన రహదారిపై గుంతలు -- ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు

గురు వందనం - జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు.

హనుమకొండ జిల్లా హడుప్సా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సబర్మతి సురేష్ కుమార్

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్
