ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు.

అధికారులతో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే తలసాని సమీక్ష

On
ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు.

IMG-20250624-WA0006 - పాల్గొన్న అన్ని శాఖల అధికారులు..

సికింద్రాబాద్ జూన్ 24 (ప్రజామంటలు):

 సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంత్రి తో పాటు దేవాదాయ కమిషనర్,జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన,మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహకాళి దేవస్థానం నందు ఆషాడ జాతర బోనాలు ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి  హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి అధ్యక్షతన చేపట్టాగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత,స్థానిక రాం గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్,మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ,దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్ర కలిగిన శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడ జాతర బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగానిర్వహించాలని దానికి తగ్గట్టుగా అన్నిశాఖల అధికారులు సమ న్వయంతో కలిసి పని చేస్తూ బోనాల జాతరను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాద్ నందు జూలై 13న అమ్మవారికి బోనాలు సమర్పణ, 14 న రంగం ( భవిష్యవాణి) అమ్మవారిని అంబారిపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని, రెండు రోజులలో భక్తులు,ప్రజలు లక్షల్లో తరలి వస్తారని ఆ దిశగా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులను  ఆదేశించారు. ముఖ్యంగా 13 వ తేదీన దేవాలయంలో భక్తులకు అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని  దేవాలయ, పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు.గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులందరూ సేవా భావం అలాగే బాధ్యతా యుతంగా పనిచేయాలని మంత్రి సూచించారు.

అదేవిధంగా రెవిన్యూ దేవాదాయ, పోలీస్ శాఖ,జిహెచ్ఎంసి  అధికారులు సమన్వయం తోకలిసి పని చేయాలని ముఖ్యంగా 14 వ తేదీన అంబారీ ఊరేగింపులో భక్తులు,ప్రజలకు తొక్కిసలాటలు కాకుండా పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బోనాల ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని,3600 దేవాలయాలకు సంబంధించి సమీక్ష రాష్ట్ర స్థాయి అధికారుల తో జరిగింది.అలాగే  గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు,శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలు,లాల్ దర్వాజా బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.

బోనాలు నిర్వహించే దేవాలయాల్లోఎక్కడ కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను,ఆలయఈవో నీ కోరుతున్న ఆలయంలోపల కేబుల్ వైర్ లు కొత్తవి వేసి ఇబ్బందులు,ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అన్ని మంత్రి సూచించారు. రాష్ట్రం తో పాటు దేశం నలుమూలల నుండి తెలంగాణ బోనాల ఉత్సవాలకు  భక్తులు తరలి వస్తారని నిరంతర విద్యుత్,త్రాగునీరు, వాహనాల పార్కింగ్, వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ నియంత్రణ, భారీ కేటింగ్ ఏర్పాట్లు, నిరంతరం నీటి నిల్వలు పరిశీలన,పారిశుద్ధ్య పనులు అలాగే మొబైల్ టాయిలెట్స్, సిసి కెమెరాల నిర్వహణ  ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులు మంత్రి ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే  శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటేనే తెలంగాణకు ఒక ప్రత్యేకమని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమిష్టితో ఏసి పనిచేయాలని, వివిధ శాఖల అధికారులు పోలీసు అధికారుల సర్వీసును ఈ జాతరలో ఉపయోగించు కోవాలని అన్నారు.

అమ్మవారికి బోనాలు సమర్పణ,ఊరేగింపులో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎస్.కామేశ్వర్,టెంపుల్ ఈఓ మనోహర్ రెడ్డి,ఆదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు,ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్,ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే,మహంకాళి ఏసిపి సుబ్బయ్య,సికింద్రాబాద్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్,ఎస్.ఈ విద్యుత్ శాఖ చక్రపాణి,ఆర్అండ్ బి ఈఈ మనోహర్, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి,జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ,వాటర్ వర్క్స్,మెడికల్, మహంకాళి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పరుశురాం,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- జోగిని వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు..
మాకు బోనం ఎత్తుకునే వారే ప్రథమ ప్రాధాన్యత...జోగిని వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం...బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపీలు దర్శనానికి వస్తే ఇబ్బందులు ఉండవు,ఉజ్జయిని మహకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి.. డెక్కన్ మానవ సేవ సమితి,ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాయి.అందరూ వారి సహకారం అందించి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలి.. అన్ని పొన్నం ప్రభాకర్ అన్నారు.

Tags

More News...

Local News 

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర  -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్    జగిత్యాల జూలై  20 (ప్రజా మంటలు) ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలకపాత్ర అని ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్ అన్నారు. ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నూతనంగా ఎన్నికైన వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులను ఆదివారం...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.  -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్ 

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.   -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్     జగిత్యాల జూలై 20 : (ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ జయంతి అన్నారు. వాల్మీకి ఆవాసం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ద్వారా...
Read More...
Local News  State News 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్ 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్  హైదరాబాద్ జూలై 20:   తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ - గౌరవ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  అధ్యక్షతన, 27.06.2025న HRC నెం.510/2025లో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, డైలీవేజ్ & ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు దాఖలు చేసిన కేసులో తుది తీర్పు ఇచ్చింది.చట్టబద్ధమైన...
Read More...
Local News 

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్  తిప్పలు తీర్చాలి

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్  తిప్పలు తీర్చాలి -తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య ఖర్చుల రీయింబర్స్ మెంట్ కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్  తీవ్ర...
Read More...
Local News 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు ఇబ్రహీంపట్నం జూలై 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేశ్వర్రావు పేట, సత్తక్క పల్లి గ్రామ శివారులోని NH 63 రహదారిపై ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా,అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలను మరియు బండ లింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆర్...
Read More...
Local News 

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి సికింద్రాబాద్, జూలై 20 (ప్రజామంటలు ): బోనాల జాతర ఆదివారం సిటీలో వందలాది ఆలయాల్లో కన్నులపండువగా సాగింది. పద్మారావునగర్ లోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న శ్రీశ్రీ మావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఉదయం నుంచే వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు. చిన్నా, పెద్ద...
Read More...
Local News 

గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.

గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి. బోనాల వేడుకల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమా - అమ్మవార్లకు బోనాల సమర్పణ సికింద్రాబాద్ జూలై 20 (ప్రజామంటలు) :   బోనాల పండగ నేపథ్యంలో  ఆదివారం పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని  పలు ఆలయాలను సందర్శించారు. ఈసందర్బంగా సంప్రదాయబద్దంగా అనంతరం...
Read More...
Local News 

మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి  పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి  పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి జూలై 20 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల వైఎస్ ఎంపిపి ఆవుల సత్యం తల్లి అనారోగ్యంతో బాధపడుతు జగిత్యాల  ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న  వారిని  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట  మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు....
Read More...
Local News 

ప్రతి ఆదివారం  అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

ప్రతి ఆదివారం  అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ గొల్లపల్లి జూలై 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా  కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘము అధ్యక్షులు. కొప్పుల ఈశ్వర్ నివాళ్లు అర్పించారు.  దేశానికి అంబేద్కర్...
Read More...
Local News 

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి         జగిత్యాల జులై 19(ప్రజా మంటలు)   పట్టణంలోని వివిధ వార్డులలో ఇంకా మిగిలి ఉన్న నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం ను కౌన్సిలర్లతో కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు. రానున్న పండగల దృష్ట్యా వెంటనే పోల్స్ వేయించి...
Read More...
Local News 

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు :   ఎమర్జెన్సీ అంబులెన్స్ 108 లో ఈ ఏం టి గా ఉద్యోగం నిర్వహిస్తున్న అంకతి మానస శ్రవణ్ కి 2024 -  2025  జిల్లా ఉత్తమ ఇఎంటిగా, స్టార్ అవార్డు సాధించారు . శనివారం ఈ సందర్భంగా 108 జిల్లా ఇంచార్జ్  పిఎం జనార్ధన్ ,
Read More...

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు లయన్స్ క్లబ్ లో పదవీప్రమాణ స్వీకారం  - పేద విద్యార్ధులకు ఆర్థిక సాయం సికింద్రాబాద్, జూలై 19 (ప్రజామంటలు): హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవభారత్, వనిత భారత్ క్లబ్ ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ పదవీస్వీకరణ ఇన్స్టలేషన్ ప్రొగ్రాం శనివారం లయన్స్ భవన్ సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ భవనంలో  జరిగింది.  ముఖ్య అతిథిగా లయన్...
Read More...