ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మల్లాపూర్ జులై 18 ( ప్రజా మంటలు)
నేరాల నియాత్రణకు గ్రామాల్లో విజిబుల్ పొలిసింగ్ పై దృష్టి సారించాలి.
యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలపై, సైబర్ నెరలపై చైతన్యాన్ని తీసుకురావాలి
వార్షిక తనిఖీల్లో భాగంగా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
శుక్రవారం వార్షిక తనిఖీ లో భాగంగా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎస్పి పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని అన్నారు. నేరాల నివారనే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందును అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి పకడ్బంది గా పని చేయాలని, గ్రామాలలో జరిగే శాంతి భద్రతల అంశాలను ముందస్తు సంచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాబోవు రోజులో కురిసే వర్షాల దృష్ట్యా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పర్చాలని సూచించారు.ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు.
అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రాములు ,మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్,మల్లాపూర్ ఎస్.ఐ రాజు , ఎస్.ఐ లు అనిల్, చిరంజీవి, రాజు నాయక్, శ్రీధర్ రెడ్డి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
